Vijay Dalapathy Vamsi Paidipally: భారీ ధరలకు అమ్మడుపోయిన వారసుడు మలయాళీ రైట్స్.. ఎన్ని కోట్లంటే?

ప్రస్తుత కాలంలో ఒక భాషలో సినిమాలన్నీ కూడా ఇతర భాషలలో విడుదలవుతున్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే దర్శక నిర్మాతలు పెద్ద ఎత్తున సినిమాలను వివిధ భాషలలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.

 Malayalee Rights The Heir Who Was Sold At Huge Prices How Many Crores, Malayalee-TeluguStop.com

ఇకపోతే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కోలీవుడ్ హీరో విజయ్ దళపతి హీరోగా దిల్ రాజు నిర్మాణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం వారసుడు.ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమవుతుంది.

ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి టీజర్లు పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.

ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే పలు భాషలలో పెద్ద ఎత్తున మార్కెట్ జరుపుకుంటుంది.

ఈ క్రమంలోనే ఈ చిత్రాన్ని కేరళలో మలయాళ భాషల్లో కూడా విడుదల చేయడానికి చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తున్నారు.ఇక కేరళలో వారసుడు సినిమా రైట్స్ భారీ ధరలకు అమ్ముడుపోయాయని.

విజయ్ కెరియర్ లోనే వారసుడు సినిమా మలయాళీ భాషలో భారీ బిజినెస్ జరుపుకుందని చెప్పాలి.ఇప్పటివరకు విజయ్ నటించిన పలు సినిమాలు కేరళలో విడుదల అయినప్పటికీ ఏ సినిమా కూడా వారసుడు సినిమా స్థాయిలో బిజినెస్ జరుపుకోలేదని తెలుస్తుంది.

Telugu Directervamsi, Malayalee, Sold, Vijay Dalapathy-Movie

వారసుడు సినిమా కేరళలో ఏకంగా ఆరు కోట్ల రూపాయలకు మలయాళీ రైట్స్ కొనుగోలు చేసినట్టు సమాచారం.విజయ్ కెరియర్ లోనే ఈ సినిమా హైయెస్ట్ బిజినెస్ జరుపుకున్నట్టు తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో విజయ్ సరసన నేషనల్ రష్మిక మందన్న నటిస్తున్నారు.దాదాపు 70 శాతం షూటింగ్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమాకి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.

శరవేగంగా షూటింగ్ పనులను పూర్తి చేసుకొని ఈ సినిమా సంక్రాంతి బరిలో పోటీకి సిద్ధమవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube