తెలుగులోకి 'ది ఫ్యామిలీ మ్యాన్ '

"ది ఫ్యామిలీ మాన్" వెబ్ సిరీస్ లు దేశవ్యాప్తంగా ఎంతటి సంచలన విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

పోటీ వేదికగా విడుదలైన ఈ వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఉగ్రవాదం నేపధ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఆశించిన స్థాయి కంటే ఎక్కువ విజయవంతమయ్యాయి.ఇక మొదటి సీజన్ సంచలన విజయంతో మేకర్స్ రెండో సీజన్ ను మరింత ఆసక్తిగా రూపొందించారు.

ఇటీవలే విడుదలైన ది ఫ్యామిలీ మాన్ -2 సిరీస్ రికార్డు స్థాయిలో విజయం సాధించింది.ఈ సీజన్ లో సమంత, ప్రియమణి కూడా నటించడంతో తెలుగు ప్రేక్షకులు సైతం భారీగా అంచనాలు నెలకొన్నాయి.

దీంతో ది ఫ్యామిలీ మాన్ తెలుగులో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు.అయితే ఈ వెబ్ సిరీస్ విడుదలైన రెండు నెలలు గడుస్తున్నా ఇంతవరకు తెలుగు వెర్షన్ ని విడుదల కాలేదు.

Advertisement

తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు వారందరూ ఎదురుచూపులు కు ఫుల్ స్టాప్ పెడుతూ అమెజాన్ ప్రైమ్ ఫ్యామిలీ 2 విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

అయితే తేదీని మాత్రం ప్రకటించలేదు కానీ తెలుగు ప్రేక్షకులు ఆసక్తి దృష్ట్యా త్వరలో స్ట్రీమింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తుందట సెకండ్ సీజన్ లో బాలీవుడ్ నటుడు మనోజ్ భాజ్ పాయ్ లీడర్ రోల్ లో నటించిన గా ప్రియమణి, సమంత కీలక పాత్రలో నటించారు.ఇందులో సమంత శ్రీలంక మహిళ టెర్రరిస్టుగా నటించింది.

Advertisement

తాజా వార్తలు