దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్.ఇది బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీగా తెరకెక్కుతుంది.
ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.అయితే మార్చి 27 రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఒక పోస్టర్ ను లాంచ్ చేయబోతున్నారని అధికారికంగా ప్రకటించారు.
అయితే రామ్ చరణ్ పుట్టిన రోజు నాడు ఈ పోస్టర్ విడుదల అవుతుందని అంతా భావించారు.కానీ పుట్టిన రోజుకు ఒక రోజు ముందుగానే ఈ సంబరాలు స్టార్ట్ అవ్వబోతున్నాయని రాజమౌళి కన్ఫర్మ్ చేయడంతో మెగా అభిమానులతో పాటు అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు.
రాజమౌళి ఎలాంటి పోస్టర్ విడుదల చేస్తారో అని అందరిలో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
రామ్ చరణ్ రేపు తన 35 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.
ఈ సందర్భంగా ఆర్ ఆర్ ఆర్ నుండి ఒక కొత్త పోస్టర్ రాబోతుంది.ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఈ పోస్టర్ ను విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
మరి ఎలాంటి పోస్టర్ రాబుతుందో తెలియాలంటే ఈ రోజు సాయంత్రం వరకు వేచి ఉండాల్సిందే.బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఇప్పటికే ఈ సినిమా 80 శాతం పూర్తి చేసుకుంది.ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్నాడు.
రామ్ చరణ్ సరసన ఆలియా భట్ నటిస్తుంటే.ఎన్టీఆర్ సరసన ఇంగ్లిష్ నటి ఒలీవియా మోరిస్ నటిస్తుంది.
ఈ సినిమాలో అజయ్ దేవగన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమాను అక్టోబర్ 13 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.