'ఉస్తాద్'లో మెయిన్ హైలెట్స్ ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కు కిక్కే కిక్కు!

Main Highlights Of Ustaad Bhagat Singh Movie Details, Ustaad Bhagat Singh, Harish Shankar, Pawan Kalyan, Sreeleela,Ustaad Bhagat Singh Movie Latest Update,Harish Shankar Pawan Kalyan New Movie Latest News,Ustaad Bhagat Singh Movie Highlights Latest Updates

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్( Harish shankar ) కాంబోలో మరో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.ఈ కాంబో అంటే టాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది ఈ కాంబో లోనే కావడంతో మరోసారి ఈ కాంబో ఎప్పుడు వస్తుందా అని పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.

 Main Highlights Of Ustaad Bhagat Singh Movie Details, Ustaad Bhagat Singh, Haris-TeluguStop.com

2012లో గబ్బర్ సింగ్ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.మరి ఎట్టకేలకు ఎన్నో ఏళ్ల తర్వాత ఈ ఇద్దరి కాంబోలో మరో సినిమా రాబోతుంది.పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ”ఉస్తాద్ భగత్ సింగ్” (Ustaad Bhagat Singh).

ఈ సినిమా షూట్ స్టార్ట్ అయ్యి మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తి అయింది.

Telugu Harish Shankar, Harishshankar, Pawan Kalyan, Sreeleela, Ustaadbhagat-Movi

ఇప్పటికే ప్రీ లుక్ పోస్టర్ తో పాటు ఇటీవలే గ్లింప్స్ కూడా రిలీజ్ చేయగా మరింత హైప్ పెరిగింది.ఇక ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేసే పనిలో మేకర్స్ బిజీగా ఉన్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమాలో హైలెట్స్ గురించి ఇప్పుడొక న్యూస్ వైరల్ అవుతుంది.

ఈ సినిమాలో మెయిన్ హైలెట్స్ గా డైలాగ్స్ ఉంటాయని అంటున్నారు.హరీష్ శంకర్ ఎలాంటి పంచ్ డైలాగ్స్ రాస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఈసారి మరింత పవర్ఫుల్ డైలాగ్స్ రాసినట్టు తెలుస్తుంది.

Telugu Harish Shankar, Harishshankar, Pawan Kalyan, Sreeleela, Ustaadbhagat-Movi

పవన్ ఒరిజినాలిటీకి దగ్గరగా ఈ సినిమాలో హరీష్ రాసిన పంచ్ డైలాగ్స్ అదిరిపోతాయని.పొలిటికల్ టార్గెట్ తో పవన్ పంచ్ డైలాగ్స్ ఉంటాయని.ఖచ్చితంగా డైలాగ్స్ ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు.

ఇక ఈ సినిమా పవన్ కళ్యాణ్ కు హీరోయిన్ శ్రీలీలకు మధ్య లవ్ అండ్ ఫన్ సీన్స్ ఉంటాయని వచ్చే షెడ్యూల్ లో ఈ కీలకమైన సీన్స్ నే హరీష్ చిత్రీకరించ బోతున్నాడు అని టాక్.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube