‘ఉస్తాద్’లో మెయిన్ హైలెట్స్ ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కు కిక్కే కిక్కు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్( Harish Shankar ) కాంబోలో మరో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.

ఈ కాంబో అంటే టాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది ఈ కాంబో లోనే కావడంతో మరోసారి ఈ కాంబో ఎప్పుడు వస్తుందా అని పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.

2012లో గబ్బర్ సింగ్ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.మరి ఎట్టకేలకు ఎన్నో ఏళ్ల తర్వాత ఈ ఇద్దరి కాంబోలో మరో సినిమా రాబోతుంది.

పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ''ఉస్తాద్ భగత్ సింగ్'' (Ustaad Bhagat Singh).

ఈ సినిమా షూట్ స్టార్ట్ అయ్యి మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తి అయింది.

"""/" / ఇప్పటికే ప్రీ లుక్ పోస్టర్ తో పాటు ఇటీవలే గ్లింప్స్ కూడా రిలీజ్ చేయగా మరింత హైప్ పెరిగింది.

ఇక ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేసే పనిలో మేకర్స్ బిజీగా ఉన్నారు.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో హైలెట్స్ గురించి ఇప్పుడొక న్యూస్ వైరల్ అవుతుంది.

ఈ సినిమాలో మెయిన్ హైలెట్స్ గా డైలాగ్స్ ఉంటాయని అంటున్నారు.హరీష్ శంకర్ ఎలాంటి పంచ్ డైలాగ్స్ రాస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఈసారి మరింత పవర్ఫుల్ డైలాగ్స్ రాసినట్టు తెలుస్తుంది. """/" / పవన్ ఒరిజినాలిటీకి దగ్గరగా ఈ సినిమాలో హరీష్ రాసిన పంచ్ డైలాగ్స్ అదిరిపోతాయని.

పొలిటికల్ టార్గెట్ తో పవన్ పంచ్ డైలాగ్స్ ఉంటాయని.ఖచ్చితంగా డైలాగ్స్ ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు.

ఇక ఈ సినిమా పవన్ కళ్యాణ్ కు హీరోయిన్ శ్రీలీలకు మధ్య లవ్ అండ్ ఫన్ సీన్స్ ఉంటాయని వచ్చే షెడ్యూల్ లో ఈ కీలకమైన సీన్స్ నే హరీష్ చిత్రీకరించ బోతున్నాడు అని టాక్.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

స్టార్ హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్న కొరటాల శివ