టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.ఇప్పటికే డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కనున్న సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.ఇక ఈ సినిమా గత ఏడాది నుండి కోవిడ్ ప్రభావంతో వాయిదాలు పడుతూ ఉండగా ప్రస్తుతం షూటింగ్ బిజీలో ఉంది.
ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళితో మరో సినిమా ప్లాన్ చేశాడు మహేష్.ఈ సినిమాలో మరో స్టార్ హీరో కూడా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
వీటితో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కూడా మహేష్ సినిమా చేయనున్నట్లు తెలిసిందే.ఇక వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ మంచి సక్సెస్ అందుకోగా.మళ్లీ వీరి కాంబినేషన్ లో మరో సినిమా ఉందటే అభిమానులకు పండగే అని చెప్పాలి.ఇక హారిక హాసిని క్రియేషన్స్ లో కూడా మరో ప్రాజెక్టుకు సైన్ చేసాడని టాక్.
ఇదిలా ఉంటే పాన్ ఇండియా లెవెల్ లో దూసుకెళ్తున్న రాజమౌళి దర్శకత్వంలో మల్టీ స్టారర్ లతో సినిమా ఉందని గతంలో ప్రకటించారు.

ఈ సినిమా ఆఫ్రికా అడవి నేపథ్యంలో ఉంటుందని గతంలో తెలిపారు.ఇక ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ రాస్తున్నాడట.ఇక రెండు రకాల కథల మీద ఈ సినిమా ఉంటుందని ఒకటి ఆఫ్రికా అడుగులో అయితే మరొకటి త్వరలోనే తెలుపుతామని గతంలో తెలిపారు.
ఇక ఈ సినిమాలో మరో స్టార్ హీరో నటించనున్నట్లు వార్తలు వినిపించాయి.అందుకోసం తమిళం నుంచి ఓ స్టార్ హీరోను తీసుకున్నాడట రాజమౌళి.ఇక ఆ హీరో గురించి ఎటువంటి ప్రకటన ఇవ్వకపోగా త్వరలోనే ఈ విషయం గురించి అధికారికంగా ప్రకటన చేయనున్నారు.ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్ తో థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించనున్నాడు రాజమౌళి.