సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘లైగర్’.రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మొదటిసారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తుండడంతో ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.మరి వారి ఎదురు చూపులు ఈ రోజుతో ఫలించాయి.ఈ సినిమా ఆగస్టు 25న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది.ఇప్పటికే ప్రీమియర్స్ కూడా పడ్డాయి.ఇక ఈ సినిమాను పూరీ కనెక్ట్స్ ఇంకా ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు.
ఈ సినిమాలో లైగర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది.వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించాడు.
ఈ సినిమాకు నెల రోజులు ముందు గానే ప్రొమోషన్స్ స్టార్ట్ చేసారు.వరుసగా ఇంటర్వ్యూలు చేస్తూ ఈ సినిమాపై ఆసక్తి పెంచేశారు.ఈ క్రమంలోనే తాజాగా లెక్కల మాస్టారు సుకుమార్ పూరీ జగన్నాథ్ ను ఇంటర్వ్యూ చేసాడు.దీనికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
అయితే ఈ ఇంటర్వ్యూ చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం సుకుమార్ మీద ఫైర్ అవుతున్నారు.సుకుమార్ పూరీని ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో మహేష్ తో సుకుమార్ చేసిన 1 నేనొక్కడినే సినిమా గురించి ప్రస్తావించాడు.
దీంతో ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణం అయ్యాడు.అసలు విషయంలోకి వెళ్తే.2014లో సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సినిమా 1 నేనొక్కడినే.ఈ సినిమా మహేష్ ఫ్యాన్స్ ను సైతం మెప్పించలేక పోయింది.
ఈ ఇంటర్వ్యూలో కూడా మహేష్ ఇదే విషయం చెబుతూ.సరళంగా చెప్పాల్సిన కథను క్లిష్టంగా చెప్పడం వల్లనే ఎదురు దెబ్బ తగిలింది అని.అయితే ఈ సినిమా తర్వాతనే తనకు కథలు ఎలా చెప్పాలో అర్ధం అయ్యింది అని చెప్పుకొచ్చాడు సుక్కు.దీంతో మహేష్ ఫ్యాన్స్ ఈయనను ఓ రేంజ్ లో ఏసుకుంటున్నారు.
మీకు ప్రయోగం చేయడానికి మా హీరోనే దొరికాడా అంటూ తిట్టిపోస్తున్నారు.మహేష్ తో విఫలం అయిన తర్వాత ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో, చరణ్ తో రంగస్థలం, అల్లు అర్జున్ తో పుష్ప తెరకెక్కించి సూపర్ హిట్స్ అందుకున్నారు.
కానీ మా హీరోకు మాత్రం ప్రయోగం చేసి ప్లాప్ ఇచ్చారు అంటూ మండిపడుతున్నారు.