ఈ కాకి వంపులు చూశారా? ‘క్యాట్ వాక్’తో అదరగొట్టింది..

జంతువులు, పక్షుల అందమైన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.చాలా సార్లు ఈ వీడియోలు సరదాగా ఉంటాయి.

 See These Crow S Feet Cat Walk Was A Hit,crow, Viral Latest, News Viral, Socia-TeluguStop.com

కొన్ని వీడియోలు ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది.అలాంటి వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ వీడియో చూస్తే మీరు కూడా ఒక క్షణం ఆశ్చర్యపోతారు.ఇప్పటి వరకు మీరు ‘క్యాట్‌వాక్’ లేదా ర్యాంప్ వాక్ చేసే మోడల్స్‌ని మాత్రమే చూశారు.

అందుకోసం వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు.కానీ, కాకి కూడా మోడల్స్‌లా క్యాట్‌వాక్ చేయగలదని మీకు తెలుసా.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలోని కాకి స్టైల్ ఇది.ఈ వీడియోని ప్రజలు ఎక్కువగా ఇష్టపడటానికి ఇదే కారణం.

ఓ కాకి ఎలాంటి ట్రైనింగ్ లేకుండా మోడల్ గా మారింది.ఓ పిట్టగోడపై క్యాట్ వాక్ చేస్తూ అదరగొట్టింది.వయ్యారంగా నడుము తిప్పుతూ.ఎంతో స్టయిలిష్ గా నడుస్తోంది.

స్టేజ్ పైన ర్యాంప్ వాక్, క్యాట్ వాక్ చేసే మోడల్స్, హీరోయిన్ల కన్న ఈ కాకి ఎంత బాగా వాక్ చేసిందో.ఈ వీడియోను ఓ ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు.

ఈ వీడియో చూసిన వారందరూ పడిపడి నవ్వుతున్నారు.ఉదయాన్నే కాకి అరిస్తే చిరాకు పడుతుంటారు.

కానీ ఈ వీడియో చేస్తే మాత్రం కాకి ఇలా కూడా చేస్తుందా అని ఆశ్చర్యపోతారు.ఈ వీడియోకు ఇప్పటి వరకు 7.5 లక్షల వ్యూస్ వచ్చాయి.వేలాది లైకులు వచ్చాయి.

కామెంట్లు కూడా భారీగానే వస్తున్నాయి.‘వాట్ ఏ స్టయిల్’, వాకింగ్ స్టయిల్ సూపర్, మిస్ బ్లాక్ బ్యూటీ’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరి ఈ కాకి క్యాట్ వాక్ వీడియోను మీరు ఓసారి చేసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube