టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.ఇప్పటికీ సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే పూర్తిస్థాయిలో సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.
సినిమా పూర్తి ఐఏఎస్ స్టేజ్ కి వచ్చినా కూడా ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ని అనౌన్స్ చేయలేదు.దీంతో త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాను ఎస్ఎస్ఎంబీ 28 పేరుతో పిలుస్తున్నారు.
ఇకపోతే మహేష్ బాబు 28 వ సినీమాకు సంబంధించిన అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త తెగ వైరల్ అవుతోంది.అదేమిటంటే ఎస్ఎస్ఎంబీ 28 సినిమా హక్కులు భారీ రేటుకి అమ్ముడైనట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.దీంతో పాటుగా మరో వార్త కూడా వినిపిస్తోంది.
అదేమిటంటే అభిమానులందరికీ ఒక సర్ప్రైజ్ ఇచ్చే విధంగా మార్చి 22వ తేదీన ఒక గట్టి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.ఆరోజు ఉగాది పండుగ కావడంతో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా టైటిల్ సహా ఫస్ట్ లుక్ ఆరోజే రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఉగాది పండుగ రోజున ఏదైనా పని మొదలు పెడితే అంతా మంచే జరుగుతుంది అన్న సెంటిమెంట్ తో రోజున సినిమాకు సంబంధించిన టైటిల్ అలాగే ఫస్ట్ లుక్ ను విడుదల చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.ఈ సినిమాకు ఛస్తే అనే టైటిల్ ను పెట్టాలని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.ఆ టైటిల్ అయితే సినిమాకు కరెక్ట్ గా సూట్ అవుతుందని మూవీ మేకర్స్ ఆలోచిస్తున్నట్టుగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.
ఛస్తే నా ఇదేం టైటిల్ రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కొందరు త్రివిక్రమ్ కి వేరే టైటిల్స్ దొరకడం లేదా ఇలాంటి టైటిల్ ని పెట్టాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.







