వెండితెర చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.పెళ్లి కాకముందు వరకు ఈమె తెలుగు తమిళం హిందీ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడిపారు.
ఇలా నటిగా ఇండస్ట్రీలో అగ్ర హీరోలు అందరి సరసన నటించి మెప్పించిన ఈమె పెళ్లి తర్వాత కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు.కాజల్ వివాహం తర్వాత కరోనా రావడం అనంతరం అదే సమయంలోనే ఈమె ప్రెగ్నెంట్ కావడంతో సినిమాలకు కాస్త విరామం ప్రకటించారు.
ఇలా ప్రెగ్నెన్సీ సమయంలో కాజల్ అగర్వాల్ సినిమాలకు దూరంగా ఉన్న తన ప్రెగ్నెన్సీ గురించి తరచూ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ అభిమానులను సందడి చేశారు.
ఇక ఈమె గత ఏడాది ఏప్రిల్ లో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు.
ఇలా ఈమె బాబు పుట్టిన తర్వాత మూడు నెలల పాటు తన బాబు ఆలనా పాలన చూసుకుంటూ ఉన్నారు.అయితే మూడు నెలలు పూర్తికాగానే తిరిగి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు.
అయితే ఈమె ప్రస్తుతం కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఇండియన్ 2 సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారు.అలాగే ఈమె నటించిన ఘోస్టీ సినిమా ఈనెల 17 వ విడుదల కానుంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా కాజల్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ సినిమా గురించి కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ ఈ సినిమా హర్రర్ కామెడీ జానర్ లో సాగే చిత్రమని తెలిపారు.ఇందులో తాను ఒక పోలీస్ అధికారిని గాను అలాగే దయ్యం పాత్రలో కూడా కనిపిస్తానని ఈ సందర్భంగా కాజల్ తెలిపారు.ఇక ఈ సినిమా గురించి పలు విషయాలను ముచ్చటించిన ఈమె తన బిడ్డ గురించి కూడా తెలియజేశారు.

తన కుమారుడు పుట్టిన తర్వాత మూడు నెలలకే ఈమె సినిమా షూటింగులతో బిజీ అయ్యారు.అయితే చాలామంది ఇదే విషయం గురించి తనని ప్రశ్నిస్తున్నారని తెలిపారు.ఇక తనకు నటనపై ఉన్న ఇష్టమే తనని కెమెరా ముందు నిలబెట్టిందని కాజల్ తెలిపారు.ఇక తన కుమారుడి ఆలన పాలన తన తల్లి చూసుకోవడంతో తనకు తన కొడుకు విషయంలో ఎలాంటి టెన్షన్ లేదని అందుకే మూడు నెలలకే షూటింగులకు హాజరయ్యాను అంటూ ఈ సందర్భంగా కాజల్ తెలియజేశారు.







