ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే నేషనల్ క్రష్ గా మారి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇలా నటిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు.
ఇలా వరుస సినిమాలతో నటిస్తున్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.ఈ క్రమంలోనే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా తనకు ఓ అభిమాని పంపించినటువంటి సర్ప్రైజ్ గిఫ్ట్ గురించి తెలియజేశారు.

ఈ సందర్భంగా ఓ అభిమాని రష్మికకు చాలా ప్రేమతో ఒక ఫ్లవర్ బొకే పంపించారు.అయితే ఆ బొకే మొత్తం సీతాకోకచిలుకలు డిజైన్ లో ఉండి అధ్యంతం ఆకట్టుకునేలా ఉంది.అయితే ఈ బొకే పంపించినటువంటి అభిమాని పేరు కూడా మెన్షన్ చేయలేదు కానీ తనని ఎంతగానో ప్రేమించే అభిమానులలో తాను ఒకరిని అయితే తాను యూకే లో ఉంటానని తెలియజేశారు.ఈ క్రమంలోనే రష్మిక సదరు అభిమాని పంపించినటువంటి ఈ బటర్ ఫ్లై బొకేని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు.

ఈ సందర్భంగా రష్మిక అభిమాని పంపించిన బొకేని షేర్ చేస్తూ.ఈ కానుకను నేను ఈరోజు అందుకున్నాను.ఈ గిఫ్ట్ తన హృదయాన్ని కదిలించిందని తెలిపారు.ఇందులో పేరు లేదు కానీ ఇది ఎవరైనా వారిని నేను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను.నువ్వు నిజంగా నాలో సంతోషాన్ని నింపావు, బిగ్ టెడ్డీ బేర్ హగ్స్ టూ యూ అని పేర్కొంది.ఇన్‌స్టా స్టోరీస్‌లో రష్మిక ఈ పోస్ట్ చేస్తూ.
అభిమానికి తన ప్రేమను సంతోషాన్ని తెలియజేశారు.ప్రస్తుతం రష్మిక చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
ఇక ఈమె సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈమె పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.







