మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ,మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ఖలేజా సినిమా దాదాపు పది సంవత్సరాలు అవుతున్నప్పటికీ వీరిద్దరి కాంబినేషన్ లో మరో చిత్రం తెరపైకి రాలేదు.అయితే వీరిద్దరి కాంబినేషన్లో త్వరలోనే ఓ చిత్రం వస్తుందని జోరుగా ప్రచారం సాగింది.
అయితే త్రివిక్రమ్, ఎన్టీఆర్ మలి చిత్రం చేయటానికి కమిట్ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంటనే మహేష్ బాబుతో సినిమా చేయలేకపోయాడు.

ఈ లోగ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న” సర్కారు వారి పాట” చిత్ర షూటింగ్ ప్రారంభమవుతుందని నిర్మాతలు హడావిడి చేయడంతో మహేష్, త్రివిక్రమ్ ల సినిమాకి బ్రేక్ పడింది.అయితే జనవరిలోగా ఎన్టీఆర్ రాకపోతే త్రివిక్రమ్ మరొక సినిమా చేస్తాడనే వార్తలు వస్తున్నాయి.అయితే మహేష్ బాబు సర్కారీ వారి పాట సినిమా షూటింగ్ పూర్తయ్యేలోపు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ సినిమా తో బిజీగా ఉంటారు.
ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా పూర్తయ్యేలోపు మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు.ఇది ఇలా ఉండగా వీరిద్దరి కాంబినేషన్లో ప్రస్తుతం సినిమా వచ్చే అవకాశాలు కనిపించడం లేదని చెప్పవచ్చు.
ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న సర్కారీ వారి పాట చిత్రం పూర్తయ్యాక, రాజమౌళి సినిమా కంటే ముందుగానే మరొక సినిమా చేయాలనే ఆలోచనలో మహేష్ బాబు ఉన్నట్లు సమాచారం.అయితే కేవలం ఐదారు నెలల్లో షూటింగ్ పూర్తి చేసుకొనే దర్శకుడితో పని చేయాలని భావించారట.
కేవలం ఇంత తక్కువ సమయంలో సినిమా పూర్తి చేసే దర్శకులు పూరి జగన్నాథ్, అనిల్ రావిపూడి మాత్రమే కనుక మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా తర్వాత ఇద్దరి దర్శకులతో సినిమా తీసే అవకాశం ఉంటుందని టాలీవుడ్ సమాచారం.అయితే మహేష్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా చూడాలంటే మరికొంత కాలం ఎదురు చూడాల్సిందే.