ఇంకా ఎన్ని లైన్‌లు వింటావు మహేష్‌ బాబు?  

Mahesh Babu Too Much Waiting For 26th Movie Storyline -

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబుతో సినిమా చేయాలని చిన్నా పెద్ద దర్శకులు అంతా కూడా కోరుకుంటారు.ముఖ్యంగా కొత్త దర్శకులు, చిన్న దర్శకులు అయితే మహేష్‌తో చేసేందుకు పడి చచ్చేందుకు కూడా సిద్ద పడతారు.

Mahesh Babu Too Much Waiting For 26th Movie Storyline

అందుకే మహేష్‌కు స్టోరీ లైన్‌ చెప్పేందుకు రోజుకు కనీపం పది దర్శకులు అయినా ఆయన ఇంటి ముందు క్యూ కడతారు.ఎంతో మంది.

ఆయన కోసం స్టోరీ సిద్దం చేసినా ఆయన వద్దకు వెళ్లేవి మాత్రం చాలా తక్కువగా ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇంకా ఎన్ని లైన్‌లు వింటావు మహేష్‌ బాబు-Movie-Telugu Tollywood Photo Image

ప్రస్తుతం తన 25వ చిత్రం ‘మహర్షి’ని చేసే పనిలో ఉన్న మహేష్‌బాబు ఆ తర్వాత అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నాడు.ఆ సినిమా కాకుండా అర్జున్‌ రెడ్డి దర్శకుడు సందీప్‌ వంగ దర్శకత్వంలో ఒక సినిమాను కూడా చేసేందుకు ఓకే చెప్పాడు.సందీప్‌ వంగ చెప్పిన స్టోరీ లైన్‌ నచ్చడంతో తప్పకుండా చేస్తానంటూ హామీ ఇచ్చాడు.

తాజాగా ‘గీత గోవిందం’ చిత్ర దర్శకుడు పరుశురామ్‌ కు కూడా ఓకే చెప్పినట్లుగా సమాచారం అందుతోంది.

గీత గోవిందం చిత్రంతో ఒక్కసారిగా స్టార్‌ డైరెక్టర్‌గా పేరు దక్కించుకున్న పరుశురామ్‌ ప్రస్తుతం మెగా హీరోతో మూవీకి సిద్దం అవుతున్నాడు.ఆ తర్వాత మహేష్‌బాబుతో సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.అందుకే తాజాగా మహేష్‌ బాబును కలిసి స్టోరీ లైన్‌ చెప్పి ఓకే చేయించుకున్నట్లుగా తెలుస్తోంది.

అయితే ఆ స్టోరీ లైన్‌ను పూర్తి స్క్రిప్ట్‌గా మల్చడం, దాన్ని మహేష్‌బాబు నచ్చడం, మహేష్‌ బాబుకు డేట్లు కుదరడం, అప్పుడు ఈయనతో చేయడం.అంటే చాలా టైం పట్టే అవకాశం ఉంది.

అంటే ఇప్పట్లో వీరిద్దరి కాంబోలో మూవీ అనుమానమే కాని, గతంలో తాను ఓకే చెప్పినట్లుగా ఇప్పుడు కూడా మహేష్‌ బాబు ఓకే చెబుతూ వస్తున్నాడు.ఇంకా ఎంత మంది దర్శకులకు ఈయన ఓకే చెప్తాడో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు