సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్నాడు.ఈ సినిమాలో పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులను కట్టిపడేశాడు మహేష్.
ఇక సినిమా తరువాత తన నెక్ట్స్ సినిమాను లైన్‌లో పెట్టేందుకు రెడీ అవుతున్నాడు.అయితే గతంలో మహేష్ నటించిన ఓ సినిమా ఇప్పుడు రికార్డు బద్దలు కొట్టింది.
దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమా మహేష్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ మూవీగా రికార్డు సృష్టించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు యూట్యూబ్‌లో 2017లో అప్‌లోడ్ చేశారు.
కాగా తాజాగా ఈ సినిమా 100 మిలియన్ వ్యూస్‌కు చేరువలో ఉంది.ఇప్పటివరకు ఈ సినిమాకు 99,279,689 వ్యూస్ రావడంతో ఈ సినిమా ఆల్‌టైమ్ రికార్డు సృష్టించేందుకు రెడీ అయ్యింది.
సోషల్ మెసేజ్‌తో వచ్చిన ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.
ఈ సరికొత్త రికార్డుతో మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.