సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా త్రివిక్రమ్ దర్శకత్వం లో రూపొందుతున్న గుంటూరు కారం( Guntur Kaaram ) సినిమా విడుదలకు ఇంకా మూడు వారాల సమయం కూడా లేదు.అయితే ఇప్పటి వరకు షూటింగ్ పూర్తి అవ్వక పోవడం పట్ల అంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మరో వారం లేదా పది రోజుల పాటు షూటింగ్ ఉంటుంది అంటున్నారు.అయితే అవన్నీ పుకార్లే అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేశారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎంబీబీఎస్ పరీక్ష కోసం బ్రేక్ తీసుకున్న శ్రీలీల మళ్లీ వచ్చి గుంటూరు కారం సినిమా లోని పాటను చిత్రీకరణ పూర్తి చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.దీన్ని బట్టే ఒక పాట రీ షూట్ అనేది నిజమే అయ్యి ఉంటుంది అంటున్నారు.

శ్రీలీల( Sreeleela ) తో పాటు మహేష్ బాబు ఇతర యూనిట్ సభ్యులు అంతా కూడా ఆ పాట చిత్రీకరణ లో పాల్గొంటున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.త్రివిక్రమ్ ఈ సినిమా షూటింగ్ విషయం లో చాలా అలసత్వం గా వ్యవహరిస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్న మహేష్ బాబు అభిమానులకు కొందరు మీడియా వారు కౌంటర్ ఇస్తున్నారు.సినిమా షూటింగ్ విషయం లో మహేష్ బాబు వ్యక్తిగతంగా జరిగిన నష్టాలు కారనం అంటున్నారు.మొత్తానికి ఏది ఏమైనా సంక్రాంతికి సినిమా విడుదల అంటున్నారు.

ఇంకా కూడా షూటింగ్ పూర్తి చేయలేదు.కనుక చివరి నిమిషంలో గుంటూరు కారం సినిమాను వాయిదా వేస్తారా ఏంటి అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.సంక్రాంతికి పెద్ద ఎత్తున పోటీ ఉన్న నేపథ్యం లో గుంటూరు కారం సినిమా వాయిదా పడ్డా ఇబ్బంది లేదు అనేది కొందరి అభిప్రాయం.మొత్తానికి మహేష్ బాబు అభిమానులు కన్ఫ్యూజన్ లో ఉన్నారు.
ఈ సినిమా ను సంక్రాంతి పోటీ నుంచి తప్పించే ఛాన్సే లేదు అని కొందరు బలంగా వాదిస్తున్నారు.