అయన చాలా సింపుల్, అందరికి మంచి గౌరవం ఇస్తారు.. మహేష్ బాబు

టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేశ్‌ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాట.ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.

 Mahesh Babu Sarkaru Vaari Paata Press Meet Highlights, Mahesh Babu, Sarkaru Vaari Paata Movie, Ys Jagan Mohan Reddy, Keerthi Suresh,-TeluguStop.com

ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమా రేపు అనగా మే 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు,పోస్టర్ లకు,టీజర్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.

ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది.

 Mahesh Babu Sarkaru Vaari Paata Press Meet Highlights, Mahesh Babu, Sarkaru Vaari Paata Movie, YS Jagan Mohan Reddy, Keerthi Suresh, -ఆయన చాలా సింపుల్, అందరికి మంచి గౌరవం ఇస్తారు.. మహేష్ బాబు-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మహేష్ అభిమానులు థియేటర్ల వద్ద భారీ కటౌట్ లను నిర్మిస్తున్నారు.ఈ సినిమా విడుదల కావడానికి మరికొన్ని గంటల సమయం ఉండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ ను మరింత వేగవంతం చేసింది.

ఈ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా మీడియాతో ముచ్చటించిన మహేష్ బాబు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ.

Telugu Keerthi Suresh, Mahesh Babu, Sarkaruvaari, Ysjagan-Latest News - Telugu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది.ఆయనతో అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడాను కానీ ఇప్పుడు నేరుగా కలవలేదు మహేష్ బాబు.కానీ ఈమధ్య ఒకసారి నేరుగా కలవడం చాలా హ్యాపీగా అనిపించింది.జగన్ మోహన్ రెడ్డి గారు చాలా సింపుల్ గా ఉంటారు.జగన్ గారిని చూస్తే అంత సింపుల్ గా ఉంటారా? అని నేరుగా కలిసినప్పుడు అనిపించింది అని చెప్పుకొచ్చాడు మహేష్ బాబు.ఎదుటి వ్యక్తులకు మంచి గౌరవం ఇస్తారు.

ఆయన కలిసినప్పుడు చాలా విషయాల గురించి చర్చించాను.అప్పుడు సినిమాల గురించి చాలా విషయాలు అడిగి తెలుసుకున్నారు అని చెప్పుకొచ్చాడు మహేష్ బాబు.

జగన్ గారితో ఇలాంటి మరికొన్ని నీటిని జరిగితే బాగుంటుంది అని అనుకుంటున్నాను అని తెలిపారు మహేష్.అలాగే ఆయన మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానం కూడా నాకు బాగా నచ్చింది.

ఆయనతో గడిపిన సమయం గుర్తుండిపోతుంది అని సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు చెప్పుకొచ్చారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube