మహేష్‌ వాటిని లైట్‌ తీసుకున్నాడు

గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు గురించి దర్శకుడు తేజ చేసిన కామెంట్స్‌పై హాట్‌ హాట్‌ చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే.

‘హోరా హోరీ’ ప్రమోషన్‌లో భాగంగా దర్శకుడు తేజ మాట్లాడుతూ మహేష్‌బాబు కేవలం పబ్లిసిటీ కోసం మరియు ట్యాక్స్‌ను తప్పించుకోవడం కోసమే గ్రామాల దత్తతకు ముందుకు వచ్చాడు అని, చిత్త శుద్ది ఉన్నట్లుగా తాను మాత్రం భావించడం లేదు అంటూ సంచలన కామెంట్స్‌ చేశాడు.

దాంతో తేజపై మహేష్‌బాబు ఫ్యాన్స్‌ ఆగ్రహంతో ఊగి పోతున్నారు.అయితే మహేష్‌బాబు మాత్రం తేజ వ్యాఖ్యలను చాలా సింపుల్‌గా తీసుకున్నాడు.

తాజాగా మహేష్‌బాబు ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించమని కోరగా ఆ వ్యాఖ్యలపై పెద్దగా స్పందించేందుకు ఏమీ లేదు అంటూ చెప్పుకొచ్చాడు.తేజ ఏ పరిస్థితుల్లో ఆ వ్యాఖ్యలు చేశాడో అనే విషయాన్ని తాను అర్థం చేసుకుంటాను అని, అలాంటి విషయాలను తాను అస్సలు పట్టించుకోను అంటూ మహేష్‌బాబు లైట్‌ తీసుకున్నాడు.

దాంతో గత కొన్ని రోజులుగా తేజపై వస్తున్న విమర్శలకు మహేష్‌ బ్రేక్‌ వేసినట్లే అని సినీ వర్గాల వారు అంటున్నారు.

Advertisement
Pokiri : పోకిరి సినిమా ఎందుకు ఆడిందో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు

తాజా వార్తలు