2022 సంవత్సరంలో విడుదలైన సినిమాలలో మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయి.పాన్ ఇండియా సినిమాలుగా విడుదలైన సినిమాలు మాత్రమే సాధారణ సినిమాలతో పోల్చి చూస్తే బెటర్ గా కలెక్షన్లను సాధించాయి.
అయితే తెలుగు వెర్షన్ మాత్రమే విడుదలైనా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్న సినిమాలు సైతం ఉన్నాయి.ఆ సినిమాలే పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట కావడం గమనార్హం.
పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా బాక్సాఫీస్ వద్ద 132 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకోగా సర్కారు వారి పాట 155 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది.పవన్, మహేష్ తెలుగు వెర్షన్ తోనే ఈ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటే ఈ హీరోల సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా విడుదలైతే మాత్రం కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తుండగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నారు.ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.ఈ రెండు సినిమాలలో త్రివిక్రమ్ మహేష్ కాంబో మూవీ పాన్ ఇండియా మూవీగా విడుదలవుతుందో లేదో క్లారిటీ రావాల్సి ఉంది.

పవన్ క్రిష్ కాంబో మూవీ మాత్రం పాన్ ఇండియా మూవీగానే తెరకెక్కుతోందని ఇప్పటికే క్లారిటీ వచ్చింది.అయితే ఈ సినిమా షూటింగ్ విషయంలో ఎన్నో ఆవాంతరాలు ఎదురవుతూ ఉండటంతో ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదలవుతుందో లేదో చూడాల్సి ఉంది.భవిష్యత్తులో మహేష్, పవన్ కలిసి నటిస్తే బాగుంటుందని ఆయా స్టార్ హీరోల అభిమానులు కోరుకుంటున్నారు.







