పవన్ - మహేష్ మధ్య గొడవ ఖాయం

వెళుతూ వెళుతూ పవన్ కళ్యాణ్ పెద్ద బ్లాక్బస్టర్ కొట్టే తన సినీ కెరీర్ ని ముగించాలని అనుకుంటున్నారు.అందుకే అన్ని పక్కాగా సిద్ధం చేసుకున్నాడు పవర్ స్టార్.

25వ సినిమా, అది కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో.అచ్చొచ్చిన జోడి, ఒక ఇండస్ట్రీ హిట్ అందించిన జోడి.తన చివరి రెండు సినిమాలు అంచనాలు అందుకోవడంలో విఫలమవడంతో, అలాగే బయ్యర్లకు నష్టాలు తీసుకురావడంతో, ఈసారి అలా కాకుండా, తెలుగు సినిమాలు యావరేజ్ గా ఉన్నా నడిచే సంక్రాంతి సీజన్ నే టార్గెట్ చేసాడు పవర్ స్టార్.

ఎలాగో అనుకున్న దీపావళికి సినిమా రాదు.త్వరగా చుట్టేసే బదులు మెల్లిగా పండగ సీజన్ లో దింపి, కలెక్షన్లు భారిగా దండుకోవాలని ప్లాన్.పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ సినిమా జనవరి 10, 2018న కన్ఫర్మ్ అయిపొయింది.

కాని ఇక్కడ అసలు విషయం ఏమిటంటే, అక్కడ సంక్రాంతి మీద ఆల్రేడి ఖర్చీఫ్ వేసి కూర్చున్నాడు సూపర్ స్టార్.బయటకి అఫీషియల్ గా ఇంకా ప్రకటించలేదు కాని జనవరి 11న మహేష్ బాబు - కొరటాల శివ సినిమా దాదాపుగా ఖాయం అయినట్టే.

Advertisement

తేది ఒకటి రెండు రోజులు అటుఇటు అయినా, శ్రీమంతుడు కాంబినేషన్ సంక్రాంతికి దిగడం మాత్రం ఖాయం.అసలు పండగ సీజన్, ఇద్దరు అతిపెద్ద స్టార్లు, రాజమౌళి తరువాత అతిపెద్ద మార్కెట్ ఉన్న ఇద్దరు దర్శకులు.

ఇంతకంటే పెద్ద పోటి ఏముంటుంది చెప్పండి.అయితే పోటి ద్వికోణం కాదు, త్రికోణం.

వీరిద్దరితో పోటి పడేందుకు నేను కూడా వస్తున్నాను అంటున్నారు బాలకృష్ణ.కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఇటివలే మొదలైన బాలకృష్ణ 102వ సినిమా సంక్రాంతికే రాబోతున్నాట్లు వార్త.

ఇక రామ్ చరణ్ కూడా ఇదే సీజన్ ని టార్గెట్ చేసినా, త్రికోణ పోటి ఆల్రేడి ఉండటం, అందులోనూ పవన్ కళ్యాణ్ సినిమా ఉండటంతో, రంగస్థలం 1985 సంక్రాంతి పోటి నుంచి తప్పుకున్నట్లే.ఈ ఏడాది సంక్రాంతి అంటే ఖైది పెద్ద మార్కెట్ సినిమా, గౌతమీపుత్ర శాతకర్ణి మీడియం మార్కెట్ సినిమా కాబట్టి నడిచింది కాని, రెండు భారి మార్కెట్ సినిమాలు ఇలా ఒకేసారి రావడం ఈమధ్యకాలంలో ఎప్పుడు జరగలేదు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వయస్సు 93 , 107 మంది భార్యలు... 185 మంది సంతానం... ఆయన అంతమందిని పెళ్లి ఎందుకు చేసుకున్నాడో తెలుసా

ఒక్కరోజు లేట్ గా వచ్చిన ఓపెనింగ్స్ దెబ్బతిండడం ఖాయం.మరి రిలీజ్ డేట్స్ కోసం ఎన్ని యుద్ధాలు జరగనున్నాయో.

Advertisement

తాజా వార్తలు