ఇది చదివితే సన్నీ లియోన్ ని అభిమానించకుండా ఉండలేరు

సన్నీ లియోన్ కి పబ్లిక్ ఉన్న ఇమేజ్ ఎలాంటిదో మనకు తెలుసు.కేవలం మగవారు అనే కదా, ఆడవారు కూడా సన్నీ అనగానే ఓ చీప్ ఒపినియన్ కలిగి ఉంటారు.

 Heart Touching Story Behind Sunny Leone’s Adopted Daughter-TeluguStop.com

కాని తన జీవితాన్ని తట్టి చూస్తే, మనలో చాలామంది కన్నా మంచిది సన్నీ.తన గతాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎప్పుడు ప్రయత్నించలేదు.

నలుగురు నాలుగు రకాలుగా తన గురించి మాట్లాడుతారు, ఇంటర్వ్యూకి వెళితే పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తారు, కాని సన్నీ కోపగించుకోదు.వారిమీద జాలిగా నవ్వుతూ మాట్లాడుతుంది.

చివరకి తనే మాటలు తనే గెలుస్తుంది.ఎంతో మ్యేచురితి ఉంటే తప్ప ఇది సాధ్యపడదు.

రోజూ తనవైపు అదోరకంగా చూసే కనులు ఎన్నో, తన గురించి ఏదిపడితే అది రాసే పెన్నులు ఎన్నో, తన గురించి ఎప్పుడు చెడుగానే మాట్లాడే పెదాలు ఎన్నో … అయినా బాధపడదు సన్నీ.ఈ మనుషుల మధ్య ఓ దేవతలా మాట్లాడుతుంది సన్నీ.

అలాంటి సన్నీ తన మానవత్వాన్ని మరోసారి చాటుకుంటూ ఓ పసిపాపను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.ఇది కొద్దిగా పాత న్యూసే.

కాని కొత్త న్యూస్ మరొకటి బయటపడింది.అది తెలిస్తే మీరు సన్నీని మరింతగా అభిమానిస్తారు.

వివరాలు చూడండి మరి.

Heart touching story behind Sunny Leone's adopted daughter Heart Touching Story

సన్నీ దత్తత తీసుకున్న 21 నెలల పాప నిషాని అంతకుముందు 11 జంటలు కాదనుకున్నారట.ఎందుకో తెలుసా ? కారణం ఏంటో తెలిస్తే మీకు సన్నీకి, మామోలు మనుషులకి మధ్య తేడా తెలుస్తుంది.నిషా “రంగు” వలన ఆ పాపని వద్దనుకున్నారట.

అవును, నిషా నల్లగా ఉందని, ఈ పాప మాకు వద్దని వెళ్లిపోయారట.సన్నీ ఇలాంటి తేడాలు చూడలేదు.

నలుపో తెలుపో, పసిదానికి ఆలనాపాలన అవసరం, ఆదుకుంది అంతే.అల్లారుముద్దుగా పెంచుకుంటానంది.

“సన్నీ లియోన్ దత్తత తీసుకున్న పాపని ఇంతకుముందు 11 జంటలు వద్దని వెళ్ళిపోయాయి.కారణం ఆ పాప రంగు.

కాని సన్నీ తన రంగు ఏంటి, రూపు ఏంటి, ఎక్కడినుంచి వచ్చింది … ఇవేమీ చూడలేదు.ఓ తల్లి ఇవన్ని చూడదు.

నేను చూసిన అతిగొప్ప మనుషుల్లో సన్నీ ఒకరు.తన గతం వలన, తను చేసిన సినిమాల వలన పబ్లిక్ లో తనమీద ఓ రకమైన అభిప్రాయం ఉండవచ్చు.

కాని తాను మంచి మనసు ఉన్న వ్యక్తి.ఆ పాపను ఆమె ఓ గొప్ప తల్లి కాబోతోంది” అంటూ చెప్పారు చైల్డ్ అడాప్షన్ రేసౌర్స్ ఏజెన్సి సిఈఓ కుమార్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube