సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో పనిచేసే హీరో హీరోయిన్లకు ఎంతోమంది అభిమానులు ఉంటారు.ఈ క్రమంలోనే తమ అభిమాన తారల ఇష్టాయిష్టాలను తెలుసుకోవాలని చాలామంది ఎంతో ఉత్సాహ పడుతుంటారు.
ఈ క్రమంలోనే వారి అభిమాన నటీనటుల అభిరుచులను వారి వస్త్రధారణను అనుసరిస్తూ వారిపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటారు.సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత అభిమానులకు సినీతారలకు మధ్య దూరం బాగా తగ్గింది అని చెప్పవచ్చు.
తాజాగా ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’. ఈ కార్యక్రమానికి మహేష్ బాబు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ మహేష్ బాబు ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి వెల్లడించారు.ఇక ఎన్టీఆర్ మహేష్ బాబు ఫ్యామిలీ గురించి కూడా ఎన్నో విషయాలను అడుగగా మహేష్ బాబు తన కుటుంబం గురించి ఆశక్తికరమైన విషయాలు తెలిపారు.
అలాగే తన కూతురు సితార గురించి మహేష్ బాబు చెప్పడంతో అది విన్న ఎన్టీఆర్ తనకు కూతురు లేదని వెలితిగా ఉంది అంటూ తెలిపారు.మీకు ఇష్టమైన ఆహార పదార్థం ఏది అంటూ ప్రశ్నించారు.

ఈ సందర్భంగా మహేష్ బాబు తనకు ఇష్టమైన ఆహార పదార్థాల గురించి తెలిపారు చిన్నప్పటి నుంచి తనకు ఇంటి భోజనం అలవాటని అమ్మమ్మ చేతి వంట తినడం అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు.అమ్మమ్మ చనిపోయిన తర్వాత ప్రస్తుతం ఉప్పు కారం లేని ఆహార పదార్థాలను తినాల్సి వస్తుందని మహేష్ బాబు తన అమ్మమ్మ చేతి వంట గురించి మరొకసారి గుర్తు చేసుకున్నారు.ఇక ప్రస్తుతం అయితే తనకు హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టమని ఈ కార్యక్రమంలో మహేష్ బాబు తెలిపారు.ఇక నాన్న కూడా ఫుడ్ ఎంతో ఇష్టంగా తింటారని ఒకానొక సందర్భంలో అతనిలా ఫుడ్ తిని ఏకంగా అధిక బరువు పెరిగానని ఈ సందర్భంగా మహేష్ బాబు ఎన్టీఆర్ కార్యక్రమంలో ఎంతో సరదాగా ముచ్చటించారు.