సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమాతో అదిరిపోయే సక్సెస్‌ను అందుకున్న విషయం తెలిసిందే.దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మహేష్ తనదైన యాక్టింగ్‌తో ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యాడు.
ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని చాలా జాగ్రత్తగా ఎంచుకున్నాడు.వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ సినిమా రావాల్సి ఉన్నా, కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది.
దీంతో గీతాగోవిందం దర్శకుడు పరశురామ్ డైరెక్షన్‌లో మహేష్ తన నెక్ట్స్ మూవీని రెడీ చేసేందుకు రెడీ అవుతున్నాడు.ఇప్పటికే పరశురామ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మహేష్, త్వరలో ఈ సినిమాను అఫీషియల్‌గా ప్రారంభించనున్నాడు.
ఇక ఈ సినిమాలో మహేష్ సరొకత్త మేకోవర్‌తో మనముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.గతంలో మహర్షి చిత్రంలో మహేష్ మేకోవర్‌కు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ చేసుకున్నారు.మహేష్‌ను అంత స్టైలిష్‌గా చూడటంతో ప్రేక్షకులు ఆ సినిమాను చూసేందుకు ఎగబడ్డారు.ఇప్పుడు మరోసారి అదిరిపోయే మేకోవర్‌కు రెడీ అవుతున్నాడు.
పరశురామ్ రాసుకున్న కథలో మహేష్ మరోసారి అల్ట్రా స్టైలిష్ లుక్‌లో మనకు కనిపిస్తాడట.ఇక ఈ సినిమాలో మహేష్ చెప్పబోయే డైలాగులు సైతం ప్రేక్షకులకు కొత్తగా ఉంటాయట.
ఇలా చాలా అంశాల్లో మహేష్ ప్రేక్షకులకు సరికొత్తగా కనిపిస్తాడని చిత్ర యూనిటో అంటోంది.కాగా ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్ ఎవరనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.
ఇప్పటికే పులువురి పేర్లు వినిపించినా వారెవ్వరిని చిత్ర యూనిట్ కన్ఫం చేయలేదట.మొత్తానికి తన మేకోవర్‌తో మహేష్ తన ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది.