మహేష్ మొదటి సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే..?

సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీ కి వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రి పేరును నిలబెడుతూ ఎన్ని సూపర్ హిట్ సినిమాలు చేస్తూ వచ్చాడు.

బాలనటుడిగానే తన సత్త చాటుతూ హీరోగా దూసుకొచ్చాడు.

రాజకుమారుడు సినిమా తో టాలీవుడ్ కి పూర్తి స్థాయి హీరోగా మారిన మహేష్ బాబు ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు.వరుస సూపర్ హిట్ సినిమాలతో మహేష్ స్టార్ హీరో అయిపోయాడు.

ట్రెండ్ కి తగ్గ కథలు సినిమాలుగా చేస్తూ తనలోని యాక్టింగ్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ టాలీవుడ్ నెంబర్ వన్ హీరో గా ఎదిగాడు.ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో ఎవరంటే మహేష్ బాబు అనే చెప్తారు.

ఆయనకు మేల్ ఫాన్స్ కంటే ఫిమేల్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు.ప్రస్తుతం సర్కార్ వారి పాట సినిమా చేస్తున్న మహేష్ బాబు సినిమా రిలీజ్ అయితే నిర్మాతకు కోట్లు కమ్మరిస్తాయి.

Advertisement

అందుకే మహేష్ బాబు తో ఒక్క సినిమా అయినా చేయాలని నిర్మాతలు క్యూలు కడుతుంటారు.ఇకపోతే తాజగా మహేష్ బాబు 1990 లో తన మొదటి సినిమా రాజకుమారుడు రిలీజ్ చేశాడు.

రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ని అగ్ర నిర్మాత అశ్విని దత్ నిర్మించాడు.

తొలి సినిమానే ఈ రేంజ్ లో తెరకెక్కడంతో మహేష్ బాబు ఈ స్టేజి కి వస్తాడని అప్పుడే అనుకున్నారు.ఈ చిత్రం ఫుల్ రన్ లో 8 కోట్ల వరకు షేర్స్ రాబట్టుకుంది.మొదటి రోజే ఈ చిత్రం 0 .48 లక్షల షేర్ వసూలు చేసింది.అప్పటి రోజుల్లో ఓ డెబ్యూ హీరో ఈ రేంజ్ కలెక్షన్లు సాధించడం అంటే మాములు విషయం కాదు.

మొత్తానికి రాజకుమారుడు 37 కేంద్రాలలో 100 రోజులు ఆడింది.ఇక మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.ఈ సినిమా కనుక చేస్తే మహేష్ బాబు కు నేషనల్ వైడ్ గుర్తింపు మరింత రెట్టింపు అవుతుంది.

పుష్ప 2 లో శ్రీ వల్లి ని చంపేది ఎవరో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు