ఈ రోజుల్లో అలాంటి టైటిల్స్‌ అవసరమా గురూజీ?

సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్( Trivikram ) ఒక సినిమాని రూపొందిస్తున్న విషయం తెలిసిందే.

ఈ నెల చివరిలో ఆ సినిమా కు సంబంధించిన టైటిల్ ని అనౌన్స్ చేయాల్సి ఉంది.

అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ని కూడా విడుదల చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు.గత కొన్ని రోజులుగా టైటిల్ విషయమై ఆసక్తికర చర్చ జరుగుతూనే ఉంది.

సినిమా కోసం అమరావతి కి అటు ఇటు అని టైటిల్ ఖరారు చేసినట్లుగా ప్రచారం జరిగింది.కానీ తాజాగా ఊరికి మొనగాడు( monagadu ) అనే టైటిల్ ని కూడా పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఒకప్పుడు ఊరికి మొనగాడు, ముగ్గురు మొనగాళ్లు, సోగ్గాడు.ఇలాంటి టైటిల్స్ తో సినిమా లు వస్తే ప్రేక్షకులు ఆదరించే వారు.

Advertisement

కానీ ఇప్పుడు అలాంటి పాత టైటిల్స్ తో వస్తే ప్రేక్షకులు ఆదరించే అవకాశాలు కనిపించడం లేదు.ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా టైటిల్ ఉండకుంటే కచ్చితంగా ప్రేక్షకుల నుండి తిరస్కరణ ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఈ విషయం గతంలో పలు సార్లు నిరూపితం అయింది.సినిమా విజయం లో కీలక పాత్ర పోషించే టైటిల్ అనేది ఈ సినిమా కు గురూజీ ఎలా నిర్ణయిస్తాడు అంటూ అంత ఆసక్తి ఎదురు చూస్తున్నారు.

ఊరికి మొనగాడు అనే టైటిల్ ని మహేష్ బాబు అభిమానులు కొందరు స్వాగతిస్తూ ఉంటే.ఎక్కువ శాతం మంది మాత్రం తిరస్కరిస్తున్నారు.ఇలాంటి సమయంలో ప్రయోగాత్మక టైటిల్స్ అవసరం లేదని.

పాత టైటిల్స్ అస్సలే వద్దంటూ త్రివిక్రమ్ కి విజ్ఞప్తి చేస్తున్నారు.మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన గత చిత్రాలకు అతడు మరియు ఖలేజా( Khaleja ) అనే టైటిల్స్ ని పెట్టిన విషయం తెలిసిందే.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

ఆ టైటిల్స్ క్యాచీగా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

Advertisement

కాస్త అటు ఇటుగా అలాంటి సింపుల్ టైటిల్ ని ఈ సినిమా కి కూడా పెట్టాలి అంటూ మహేష్ బాబు అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు విజ్ఞప్తి చేస్తున్నారు.మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్ కి మరియు ఇమేజ్ కి తగ్గట్లుగా ఒక మంచి టైటిల్ ఎంపిక చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తే కచ్చితంగా జనాలు ఆదరిస్తారని.సినీ విశ్లేషకుల అభిప్రాయం చేస్తున్నారు.

భారీ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకునే విధంగా మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా రూపొందుతోంది.ఇక మహేష్ బాబు కి జోడిగా పూజా హెగ్డే మరియు శ్రీ లీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది.

తాజా వార్తలు