త్రివిక్రమ్ కు పెద్ద షాక్ ఇచ్చిన మహేష్.. అన్ని ప్లాన్స్ మార్చేసాడుగా..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాలో మహేష్ బాబుకు జంటగా కీర్తి సురేష్ నటిస్తుంది.మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్ కానుకగా మే 12న విడుదల కాబోతుంది.ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తునట్టు ఇప్పటికే ప్రకటించాడు.

వీరి ఇద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి.దాదాపు 11 సంవత్సరాల తర్వాత మళ్ళీ వీళ్ళ కాంబో రిపీట్ అవుతుంది.

Advertisement
Mahesh Babu And Trivikram Movie Latest Update Details, Mahesh Babu, Trivikram, L

అందుకే ఈ హ్యాట్రిక్ సినిమాను సూపర్ హిట్ చేయాలనీ త్రివిక్రమ్ గట్టి పట్టుదలతో ఉన్నాడు.ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంచ్ అయ్యింది.

ఇప్పటికే త్రివిక్రమ్ ఫైనల్ స్క్రిప్ట్ కూడా రెడీ చేసారని సమాచారం.ఇక ఈ సినిమాలో మహేష్ కు జంటగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

Mahesh Babu And Trivikram Movie Latest Update Details, Mahesh Babu, Trivikram, L

తాజాగా ఈ సినిమాపై ఒక ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.ప్రెసెంట్ మహేష్ సర్కారు వారి పాట సినిమా షూటింగ్ ఏప్రిల్ రెండవ వారం నాటికీ పూర్తి అవ్వనుంది.దాదాపు 11 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్ మహేష్ కాంబోలో సినిమా రాబోతుండడంతో ఈయన ఏప్రిల్ ఆఖరి వారం నుండి రెగ్యురల్ షూటింగ్ స్టార్ట్ చేసి నాలుగైదు నెలల్లో కంప్లీట్ చేయాలనీ త్రివిక్రమ్ పక్కాగా ప్లాన్స్ వేస్తె మహేష్ మాత్రం ఆయనకు షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

Mahesh Babu And Trivikram Movie Latest Update Details, Mahesh Babu, Trivikram, L

త్రివిక్రమ్ చేసిన ప్లాన్స్ అన్ని తారుమారు అయ్యే విధంగా మహేష్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.మార్చి నెలలో ఎండలు పెరిగిపోయాయి.ఇక మే నాటికీ అయితే ఇంకా ముదిరిపోవడం ఖాయం.

ఆ హీరో క్రేజ్ మామూలుగా లేదుగా.. చైనా సూపర్‌మార్కెట్‌లోనూ ఆయన పాటలు.. వీడియో వైరల్..
మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?

అందుకే మహేష్ ఆ నెల మొత్తం షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యాడట.ఆ నెల రోజులు ఫ్యామిలీ తో టైం స్పెండ్ చేయాలనీ వెకేషన్ ప్లాన్ చేసుకుంటున్నట్టు తాజాగా ఒక వార్త బయటకు వచ్చింది.

Advertisement

దీంతో త్రివిక్రమ్ మళ్ళీ జూన్ వరకు షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశం లేకుండా పోయింది.

తాజా వార్తలు