టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా అంతర్జాతీయ స్థాయి లో సందడి చేసిన విషయం తెల్సిందే.ఆస్కార్ రేసు వరకు ఆ సినిమా వెళ్లింది.
అందుకే రాజమౌళి తదుపరి సినిమా విషయంలో హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు.ఒక ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వం లో రూపొందబోతున్న సినిమా యొక్క నిర్మాణం లో భాగస్వామ్యం అవ్వడంతో పాటు హాలీవుడ్ టెక్నాలజీని కూడా రాజమౌళి సినిమా కు ఇచ్చేందుకు వారు ఓకే చెప్పారట.
ఈ సమయంలోనే రాజమౌళి మరియు మహేష్ బాబు సినిమా యొక్క పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.ఈ ఏడాది చివరి నుండి షూటింగ్ కార్యక్రమాలు మొదలు అయ్యే అవకాశాలు ఉన్నాయి.
మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.

ఆ సినిమా షూటింగ్ పూర్తి అవ్వడానికి సమయం పడుతుంది.ఇంతలోనే కొందరు హీరోయిన్ గురించిన ప్రచారాలు చేస్తున్నారు.ఇప్పటి వరకు హీరోయిన్ విషయంలో రాజమౌళి ఆలోచించాడా లేదా అనే విషయం పక్కన పెడితే బాలీవుడ్ కు చెందిన హాట్ బ్యూటీ దీపికా పదుకునేను హీరోయిన్ గా ఎంపిక చేశారు అనే వార్తలు వస్తున్నాయి.
అది కాకుండా ఆర్ ఆర్ ఆర్ సినిమా లో ఆలియాకు అన్యాయం చేశాను కనుక మహేష్ బాబు సినిమా ద్వారా న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో ఆమె ను మళ్లీ ఈ సినిమా లో హీరోయిన్ గా ఎంపిక చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది.మొత్తానికి ఈ సినిమా యొక్క హీరోయిన్ విషయం లో ఆసక్తికర పుకార్లు అయితే ప్రచారం జరుగుతోంది.
అది పుకారే అయినా కూడా మహేష్ బాబు అభిమానులు తెగ ఆస్వాదిస్తున్నారు.







