తెలంగణ కాంగ్రెస్ లోకి రేవంత్ అరంగేట్రం చేసిన దగ్గరి నుంచి.ఆ పార్టీ పుంజుకోవడం మొదలు అయింది.
అంతకుముందు ఉత్తమ కుమార్ రెడ్డీ అధ్యక్షుడు గా ఉన్నప్పుడు పార్టీ నానాటికీ సన్నబడింది.దానికి తోడు.
చాలా మంది నేతలు టీఆర్ఎస్ పార్టీ కి అనుకూలంగా ఉంటూ కాంగ్రెస్ ను ఎంత తొక్కాలో అంత తొక్కడానికి ప్రయత్నించారు.అంతే కాకుండా కాంగ్రెస్స్ కేడర్ ను అవలీలగా.
అటు బీజేపీ కి ఇటు టీఆరెఎస్ పార్టీ కి అందించారు.
ఇక కాంగ్రెస్ అధిష్టానం కూడా యువకులకు పార్టీ పగ్గాలు అప్పగిస్తూ వచ్చింది.
ఆ తరుణం లోనే.రేవంత్ కు పార్టీ పగ్గాలు దక్కాయి.
పగ్గాలు తీసుకోవడం తోనే స్పీడ్ పెంచారు ఆయన.అంతకాలం స్తబ్దుగా ఉన్న కేడర్ మొత్తం ఒక్కసారిగా అలెర్ట్ అయింది.దాంతో బీజేపీ తమే ప్రత్యామ్నాయం అనుకునే కలల్ని రేవంత్ చిదిమేశాడు.అయితే రేవంత్ దూకుడు కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలకు మింగుడు పడలేదు.దాంతో అడపా దడపా విమర్శలు చేస్తూ వచ్చారు.ఇక పార్టీలో అయన టీమ్ పెరుగుతూ వస్తుండటం తో సీనియర్లు ఫైర్ అయ్యారు.
కామిటిల్లోను తన వర్గానికి పెద్ద పీట వేయడం.ప్రెస్ మీట్ పెట్టీ మరి కడిగి పారేశారు.

ఇక అక్కడి నుంచి రేవంత్ ను పార్టీ నుంచి సాగ నంపాలి అని తెగ ప్లాన్ చేస్తున్నారు.రేవంత్ నుంచి పగ్గాలు లాక్కోవాలని లేదా.ఆయన్ను పంపించాలి అని సీనియర్లు అంతా చూస్తున్నారు.రేవంత్ మాత్రం పట్టు విడువని విక్రమార్కుడు లా మొండిగా ముందుకు పోతున్నారు.ఇక ఇప్పుడు పెట్టిన శిక్షణా తరగతులు సైతం తూతూ మంత్రంగా సాగాయి.భట్టి తప్పా మిగిలిన సీనియర్లు ఎవరు తరగతులకు రాలేదు.
ఏకంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున కర్గే ఉత్తమ కు ఫోన్ చేసినా స్పందించలేదు.దాంతో రేవంత్ ను తప్పిస్తెనే సీనియర్లు పనిచేస్తాం అనే సంకేతాలను అధిష్టానానికి గట్టిగా పంపారు.
మరి ఇవన్నీ చూస్తున్న అధిష్టానం రేవంత్ ను తప్పిస్తుందా.? లేక సీనియర్లనే బుజ్జగిస్తుందా చూడాలి.







