తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఇమ్మానుయేల్, వర్ష ల జంట గురించి మనందరికీ తెలిసిందే.బుల్లితెర పై రష్మి సుధీర్ జంట తర్వాత ఆ రేంజ్ లో పాపులారిటీని సంపాదించుకున్నారు వర్ష,ఇమ్మానుయేల్.
అయితే మొదట ఇమ్మానుయేల్, భాస్కర్ టీమ్ లో ఉంటూ తనదైన శైలిలో కామెడీ చేస్తూ ప్రేక్షకులను నవ్విస్తూ వచ్చాడు.ఆ తరువాత వర్ష జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ మొదలైంది.
కాగా ప్రస్తుతం ఇమ్మానుయేల్, వర్ష ఇద్దరూ బుల్లెట్ భాస్కర్ టీమ్ లో స్కిట్స్ చేస్తున్న విషయం తెలిసిందే.అయితే వీరిద్దరూ నిజంగానే ప్రేమించుకుంటున్నారా లేకపోతే ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం అలా చేస్తున్నారా అన్నది ఇప్పటికీ చాలా మందికి సందేహంగానే ఉంది.కాగా ఇప్పటికే స్టేజి పై పలు సార్లు వీరిద్దరూ ఒకరికి ఒకరు ప్రపోజ్ చేసుకున్న విషయం తెలిసిందే.అంతేకాకుండా మల్లెమాల వారిద్దరికీ కలిపి కూడా చేస్తుంది.వారిద్దరు ఒకటి రెండు ఈవెంట్ లు కూడా చేసింది.అయితే వర్ష, ఇమ్మానుయేల్ స్కిట్ అయిపోయిన తర్వాత మాత్రమే కాకుండా స్కిట్ జరుగుతున్నప్పుడు కూడా ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను వ్యక్తపరుచుకుంటూ ఉంటారు.
ఇదిలా ఉంటే తాజాగా అభిమానులు, నెటిజన్స్ వర్ష,ఇమ్మానుయేల్ చేసిన చాటింగ్ స్కిట్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతూ ట్రోల్స్ చేస్తున్నారు.ఇటీవల లవ్ టుడే సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.
తాజాగా లవ్ టుడే కాన్సెప్ట్ తీసుకుని స్కిట్ బుల్లెట్ భాస్కర్ టీమ్.

ఇక ఇందులో అమ్మాయి తండ్రి ఇద్దరి ఫోన్స్ ఒకరోజు మార్చుకోమని చెబుతాడు.ఆ తర్వాత రోజు ఇద్దరికీ ఓకే అయితే పెళ్లి చేస్తానని అంటాడు.ఇప్పుడు దీన్నే స్కిట్ గా మార్చి స్టేజ్ పై ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశారు భాస్కర్ టీమ్.
ఈ స్కిట్ లో భాగంగా వర్ష ఫోన్ లో సీక్రెట్స్ ఇమ్ముకి, ఇమ్ము ఫోన్ లో సీక్రెట్స్ వర్షకి తెలిసి ఇద్దరు షాక్ అవుతారు.ఈ క్రమంలో వర్షకి ఎక్కడ చాట్ చేయాలో తెలియక సీక్రెట్ గా ఫోన్ పేలో చాట్ చేస్తుందంటూ కామెంట్ చేస్తాడు ఇమ్ము.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అయితే కొంతమంది ఆ వీడియోపై నవ్వుతూ స్పందిస్తుండగా మరికొందరు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్కిట్ కోసం ఇలాంటి పనులా అంటూ వర్ష,ఇమ్మానుయేల్ చాటింగ్ స్కిట్ పై మండిపడుతున్నారు.వేరే కాన్సెప్ట్ దొరకలేదా అని ఫైర్ అవుతున్నారు.







