సరిగ్గా వారం లేదు ఇంకా ఈ సస్పెన్స్‌ ఏంట్రా బాబోయ్‌

సంక్రాంతి సీజన్‌ మరో వారం రోజుల్లో ప్రారంభం కాబోతుంది.దర్బార్‌ చిత్రం జనవరి 9న విడుదల అవుతూ సంక్రాంతి సీజన్‌ను ప్రారంభించబోతుంది.

ఇక సంక్రాంతికి విడుదల కాబోతున్న సరిలేరు నీకెవ్వరు మరియు అల వైకుంఠపురంలో సినిమా విడుదల తేదీల విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు.ఈ రెండు సినిమాలు కూడా జనవరి 12నే విడుదల అవ్వబోతున్నట్లుగా ఆరు నెలల క్రితమే ప్రకటన వచ్చింది.

కాని ఇప్పుడు విడుదల తేదీల్లో మార్పు గురించి చర్చ జరుగుతోంది.

అల వైకుంఠపురంలో సినిమాను అదే జనవరి 12న విడుదల చేయాలని నిర్మాతలు భీష్మించుకు కూర్చున్నారు.దాంతో ఒక్క రోజు ముందుగా సరిలేరు నీకెవ్వరు సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా రెండు వారాల ముందు చిత్ర యూనిట్‌ సభ్యులు అనఫిషియల్‌గా చెప్పారు.కాని ఎప్పుడైతే ప్రమోషన్‌ కార్యక్రమాల జోరు పెరిగిందో అప్పటి నుండి విడుదల తేదీ విషయాన్ని చెప్పడం లేదు.

Advertisement

ఇటీవలే సెన్సార్‌ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదల తేదీని ప్రకటించలేదు.

సెన్సార్‌ పోస్టర్‌లో విడుదల తేదీ లేకపోవడంతో గందరగోళం క్రియేట్‌ అవుతుంది.జనవరి 12న అల వైకుంఠపురంలో విడుదల మరియు సరిలేరు నీకెవ్వరు సినిమా ముందు రోజు అంటే 11వ తారీకు అనుకున్న వారికి షాక్‌ ఇచ్చే యోచనలో మహేష్‌ అండ్‌ టీం ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.ఒక వేళ జనవరి 11న సరిలేరు నీకెవ్వరు విడుదల చేయకుంటే మరి ఎప్పుడు చేస్తారు అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

అల వైకుంఠ పురంలో సినిమాను కూడా తేదీ మార్పించే యోచనలో ఉన్నారు.రేపు ప్రీ రిలీజ్‌ జరుపుకోబోతున్న సరిలేరు నీకెవ్వరు విడుదల తేదీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?
Advertisement

తాజా వార్తలు