నవీన్ పొలిశెట్టి హీరోగా అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన జాతి రత్నాలు సినిమా సూపర్ హిట్ అయ్యింది.ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఉన్న ఈ సినిమా ను చూసిన జనాలు ఈమద్య కాలంలో ఇలాంటి ఎంటర్ టైనర్ మూవీని చూడలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అల్లు అర్జున్ స్పందిస్తూ గత కొన్ని ఏళ్లలో ఇలాంటి ఫుల్ కామెడీ సినిమా ను చూడలేదు అంటూ కితాబిచ్చాడు.ఇప్పుడు మహేష్ బాబు జాతి రత్నాలు టీమ్ పై ప్రశంసలు కురిపించాడు.
ముఖ్యంగా నవీన్ పొలిశెట్టిపై ప్రశంసలు కురిపించాడు.నవీన్ ను మొదటి సారి వన్ నేనొక్కడినే సినిమా షూటింగ్ సందర్బంగా చూసినట్లుగా చెప్పుకొచ్చాడు.
ఆ సమయంలో ఆయన పరిచయం చేసుకున్న సమయంలోనే అతడు కెరీర్ లో ఎదిగేందుకు పడుతున్న కష్టం చూశాను అంటూ మహేష్ బాబు చెప్పుకొచ్చాడు.జాతి రత్నాలు సినిమాలో అద్బుతంగా నవీన్ పొలిశెట్టి నటించాడు అంటూ కితాబిచ్చాడు.
చిత్ర యూనిట్ సభ్యులు అంతా కూడా చాలా కష్టపడి ఈ సినిమాను చేసినట్లుగా తెలుస్తుందని వారు అందరికి కూడా అభినందనలు అంటూ ఈ సందర్బంగా మహేష్ బాబు ట్వీట్ చేశాడు.మహేష్ బాబు ట్వీట్ తో జాతి రత్నాలు సినిమా యూనిట్ సభ్యులు ఆనందంతో పొంగి పోతున్నారు.
టాలీవుడ్ స్టార్స్ అయిన ప్రభాస్ విజయ్ దేవర కొండ అల్లు అర్జున్ ఇంకా మహేష్ బాబు లు జాతి రత్నాలు టీమ్ ను అభినందించిన నేపథ్యంలో సినిమా వసూళ్లు భారీ గా ఉంటున్నాయి.భారీ పోటీ మద్య వచ్చినా కూడా మంచి వసూళ్ల ను నమోదు చేస్తున్నట్లుగా ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన వసూళ్లు ట్రేడ్ వర్గాల వారిని సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.