సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు సంబందించిన లెటెస్ట్ అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్ ని ఖుషి చేశారు ఆ సినిమా నిర్మాత సూర్యదేవర నాగవంశీ.హారిక హాసిని క్రియేషన్స్ లో మహేష్ హీరోగా త్రివిక్రం డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి కాగా సెకండ్ షెడ్యూల్ కి కొంత గ్యాప్ తీసుకున్నారు.
మహేష్ మదర్ ఇందియ కాలం చేయడంతో ఈ గ్యాప్ వచ్చింది.అందుకే ఈమధ్యనే ఫారిన్ వెళ్లొచ్చిన మహేష్ అక్కడ రిఫ్రెష్ అయినట్టు తెలుస్తుంది.
ఇక త్వరలోనే త్రివిక్రం సినిమా షూటింగ్ కి రెడీ అంటున్నాడట.
ఎస్.
ఎస్.ఎం.బి 28 సెకండ్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం అంటూ నాగ వంశీ తన ట్విట్టర్ లో షేర్ చేశారు.ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది.
సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమా పూర్తి చేశాక మహేష్ రాజమౌళి డైరక్షన్ లో సినిమా చేయాల్సి ఉంది.
మహేష్, త్రివిక్రం ఈ కాంబోలో కూడా హ్యాట్రిక్ సినిమాగా ఎస్.ఎస్.ఎం.బి 28వ సినిమా వస్తుంది.తప్పకుండా ఈ సినిమా అంచనాలను మించి ఉంటుందని చిత్రయూనిట్ చెబుతున్నారు.