'మహర్షి' జోరు మామూలుగా లేదుగా.. ఏమో అనుకున్నాం కాని మరీ ఇంతనా?

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు 25వ చిత్రం మహర్షి బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా ప్రభావం చూపదేమో అంటూ విడుదలైన మొదటి రోజు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.అయితే అనూహ్యంగా మహర్షి చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్‌ను దక్కించుకుంది.

ఇక మరో నాలుగు రోజుల్లో అంటే 8 రోజులకే 150 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను రాబట్టి ఔరా అనిపించింది.100 కోట్ల షేర్‌కు ఈ చిత్రం అతి చేరువలో ఉన్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ఇప్పటి వరకు బాహుబలి మినహా మరే సినిమాలు కూడా 10 రోజుల లోపులో 100 కోట్ల షేర్‌ను రాబట్టింది లేదు.

కాని మహర్షి చిత్రం మాత్రం ఆ రికార్డును బ్రేక్‌ చేసేలా ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు.ఇప్పటికే నాన్‌ బాహుబలి రికార్డులను సొంతం చేసుకున్న మహర్షి చిత్రం లాంగ్‌ రన్‌లో మరింత గొప్ప రికార్డులను కూడా దక్కించుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

ప్రస్తుతానికి నాన్‌ బాహుబలి రికార్డును రామ్‌ చరణ్‌ నటించిన రంగస్థలం చిత్రం కలిగి ఉంది.ఆ చిత్రం గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకుంది.అయితే ఈసారి ఆ రికార్డును మహర్షి బ్రేక్‌ చేయబోతుందని ఇప్పటికే ఖరారు అయ్యింది.

మహేష్‌ బాబు 25వ చిత్రం అవ్వడంతో పాటు సమ్మర్‌ స్పెషల్‌ అవ్వడం వల్ల సినిమా మంచి వసూళ్లను రాబట్టింది.

Advertisement

మొదటి రోజు ఈ చిత్రం విమర్శకుల నుండి మిశ్రమ స్పందన రాబట్టింది.కొన్ని రివ్యూలు బ్యాడ్‌గా కూడా వచ్చాయి.ఓవర్‌ మెసేజ్‌ అంటూ విమర్శలు వచ్చాయి.

అలాంటిది ఈ చిత్రంకు 150 కోట్ల గ్రాస్‌ కలెన్స్‌ రావడం చర్చనీయాంశం అవుతోంది.సినిమాలు పెద్దగా ఏమీ లేకపోవడంతో పాటు, మహేష్‌ బాబు వంటి పెద్ద స్టార్‌ సినిమా అవ్వడం వల్ల ఈ స్థాయిలో వసూళ్లు నమోదు అవుతున్నట్లుగా ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు