నాడు ఆటోడ్రైవర్.. నేడు ముఖ్యమంత్రి

మహారాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఏక్‌నాథ్ షిండే కేంద్ర బిందువుగా మారారు.అనూహ్యంగా ఆయన సీఎం పదవిని దక్కించుకున్నారు.

 Maharashtra New Cm Eknath Shinde Personal Political Journey, Maharashtra, Shivsena, Eknath Shinde, Uddhav Thackeray,auto Driver, New Chief Minister, Maha Vikas Aghadi,cm Eknath Shinde Personal Political Journey-TeluguStop.com

మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంపై అసంతృప్తితో తిరుగుబాటు చేసి తిరుగులేని నేతగా ఎదిగారు.ఉద్దవ్ థాక్రే సర్కారు కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్న మంత్రి ఊహించని రీతిలో తిరుగుబాటు చేశారు.

చివరకు తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి ఇప్పుడు ఏకంగా ప్రభుత్వాన్నే ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.

 Maharashtra New Cm Eknath Shinde Personal Political Journey, Maharashtra, Shivsena, Eknath Shinde, Uddhav Thackeray,auto Driver, New Chief Minister, Maha Vikas Aghadi,cm Eknath Shinde Personal Political Journey-నాడు ఆటోడ్రైవర్.. నేడు ముఖ్యమంత్రి-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తనకు సీఎం పదవి వస్తుందని షిండే కలలో కూడా ఊహించి ఉండరు.

మరాఠా వర్గానికి చెందిన ఏక్‌నాథ్‌ షిండే స్వస్థలం మహారాష్ట్రలోని సతారా జిల్లా జవాలీ తాలూకా.అయితే షిండే కుటుంబం ఠాణేలో స్థిరపడింది.ఆర్థిక ఇబ్బందుల కారణంగా చిన్నతనంలోనే చదువుకు దూరమయ్యారు.ఇంటర్ మధ్యలోనే చదువు ఆపేసి ఆటో తోలడం మొదలెట్టారు.

అలా కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చిన ఆయనకు శివసేన అధినాయకుడు బాల్ థాక్రే అంటే చాలా ఇష్టం.ఆయన ప్రసంగాలు అంటే ఇంకా ఇష్టం.

1980 దశకంలో శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే స్ఫూర్తితో షిండే రాజకీయాల్లోకి వచ్చారు.క్రమ క్రమంగా పార్టీలో కీలక నేతగా ఎదిగారు.1997లో థానే మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు.థానే జిల్లాలో జరిగిన ప్రజా ఉద్యమాల్లో ముందుండేవారు.అలా శివసేన అధిష్ఠానం దృష్టిలో పడిన షిండే.2004లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసి ఘన విజయం సాధించారు. అలా 2009, 2014, 2019లలో షిండే వరుసగా నెగ్గుతూ వచ్చారు.2014లో ఆయన శివసేన శాసనసభాపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు.

2019 ఎన్నికల్లో మహా వికాస్ అగాడీ కూటమి అంటే శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.ఈ ప్రభుత్వంలో కీలకమైన పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఏక్‌నాథ్ షిండే బాధ్యతలు చేపట్టారు.అలా ఆయన రెండున్నరేళ్ళుగా ఆ పదవిలోనే ఉన్నారు.అయితే అనూహ్యంగా ఉద్ధవ్ థాక్రేపై అసంతృప్తితో ఇటీవల తిరుగుబాటు చేశారు.దీంతో జూన్ 21న షిండేను ఉద్ధవ్ థాక్రే శివసేన పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు.అయినా 40 మంది ఎమ్మెల్యేలు ఆయన వెంట నడిచారు.

ఈ నేపథ్యంలో బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube