సుశాంత్ కేసు సీబీఐ విచారణకు మహా సర్కార్ సహకరిస్తుంది అంటున్న పవార్

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు విషయంలో అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే.

జూన్ 14 న సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్(34) తన అపార్ట్మెంట్ లోనే మెడకు ఉరివేసుకొని మృతి చెందాడు.

అయితే అతడి అకాల మృతి పై అటు కుటుంబసభ్యులు, ఇటు అభిమానులు అనుమానాలు వ్యక్తం చేశారు.సుశాంత్ మృతి లో పలు అనుమానాలు ఉన్నాయని అందుకే సీబీఐ విచారణ అవసరం అంటూ వారంతా డిమాండ్ చేశారు.

అంతేకాకుండా కేసు నమోదు చేసుకున్న ముంబై పోలీసుల విచారణ ఏమాత్రం పారదర్శకంగా లేదని, ఈ కేసు విచారణ సీబీఐ కి అప్పగిస్తేనే న్యాయంజరుగుతుంది అంటూ బీహార్ ప్రభుత్వం కూడా అభిప్రాయపడింది.దీనితో సుప్రీం కోర్టు కూడా ఈ కేసులో సీబీఐ విచారణకు అనుమతిస్తూ తీర్పు వెల్లడించడం తో ఈ తీర్పు పై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు.

ఈ కేసులో సీబీఐ విచారణకు మహారాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందంటూ ఆయన స్పష్టం చేసారు.సుశాంత్ కేసు విషయంలో ఎదో జరిగింది అని దానికి కొందరు రాజకీయ ప్రముఖుల సపోర్ట్ ఉందంటూ ఆరోపణలు వస్తున్నాయి.

Advertisement

అంతేకాకుండా సుశాంత్ కేసు విషయంలో మహా సర్కార్ లోని కొందరు నేతలు సంచలన ఆరోపణలు కూడా చేశారు.ఇలాంటి పరిస్థితుల్లో ముంబై పోలీసుల విచారణ కూడా నత్తనడక లాగా జరుగుతుంది అంటూ సుశాంత్ తండ్రి బీహార్ లో కేసు నమోదు చేయడం తో బీహార్ సర్కార్ దీనిపై స్పందించింది.

అక్కడ నుంచి ముంబై కు ఉన్నతాధికారులను పంపించి విచారణ జరపాలని భావించగా దానికి కూడా ముంబై పోలీసులు అభ్యంతరాలు వ్యక్తం చేయడం,అలానే బీహార్ పోలీసులను క్వారంటైన్ సెంటర్ లకు తరలించడం తో ఈ విషయం లో బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా స్పందించాల్సి వచ్చింది.సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదు మేరకు పాట్నా పోలీసులు సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తితో పాటు మరికొందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయగా.

బీహార్ ప్రభుత్వం ఆ తర్వాత సీబీఐ దర్యాప్తునకు సిఫార్సు చేసింది.

ఈ నేపథ్యంలో పాట్నాలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను సీబీఐకి బదిలీ చేసే అధికారం బీహార్ ప్రభుత్వానికి ఉందంటూ సుప్రంకోర్టు బుధవారం తీర్పువెల్లడించడం తో ఆ తీర్పును మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడి సర్కారు గౌరవిస్తున్నట్లు శరద్ పవార్ స్పష్టంచేశారు.ముంబై పోలీసులు నమోదు చేసిన కేసును సీబీఐకి ప్రభుత్వం బదిలీ చేస్తుందని అయితే గతంలో కొన్ని కేసులను ఛేదించడంలో సీబీఐ వైఫల్యం చెందిందన్న విషయాన్నీ గుర్తు చేసిన శరద్ పవార్ సుశాంత్ కేసులో అలా కాదని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు