హైకోర్టు లో కరోనా కలకలం,న్యాయమూర్తులను సైతం వదలలేదు

కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహమ్మారి.

ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ప్రాణాలు కోల్పోతుండగా, ఈ వైరస్ బారిన పడి పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ మహమ్మారి కి రాజు,పేద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు.తాజాగా మద్రాస్ హైకోర్టు లో కూడా కరోనా కలకలం సృష్టించింది.

హైకోర్టు లో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు న్యాయమూర్తులకు కరోనా పాజిటివ్ అన్నట్లుగా తేలింది.దీనితో మిగిలిన సిబ్బందికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించగా రిపోర్ట్స్ రావాల్సి ఉంది.

ఇలా ముగ్గురు న్యాయమూర్తులకు పాజిటివ్ రావడం తో హైకోర్టు కు తాళం వేయాల్సి వచ్చింది.దీనితో ఇంటి నుంచే కేసుల విచారణ అనేది జరుపుతున్నట్లు తెలుస్తుంది.

Advertisement

మద్రాస్ హైకోర్టుకు ప్రతి సంవత్సరం ఒక్క రోజు మాత్రం తాళం వేస్తారు.అయితే, ప్రస్తుతం జడ్జిలకు కరోనా సోకడంతో తాళం వేయక తప్పలేదు.

హైకోర్టు న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశానంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. హైకోర్టుకు న్యాయవాదులు, సిబ్బంది ఇక రావద్దని ఆదేశాలు జారీ చేసి, అత్యవసర కేసుల విచారణకు ప్రత్యేక బెంచ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది.

ఈ బెంచ్‌లకు నియమించిన జడ్జిలు ఇళ్ల నుంచే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణలు చేపట్టనున్నారు.ఇందు కోసం ప్రత్యేకంగా న్యాయమూర్తులు వినిత్‌ కొతారి, సురేష్‌ కుమార్‌ నేతృత్వంలో ఓ బెంచ్, న్యాయమూర్తులు శివ జ్ఞానం, పుష్పా సత్యనారాయణల నేతృత్వంలో మరో బెంచ్‌ ఏర్పాటు చేశారు.

బీజేపీ కార్మిక, కర్షక వ్యతిరేక పార్టీ.. మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు
Advertisement

తాజా వార్తలు