తాజాగా తమిళ స్టార్ హీరో శింబు( Tamil Star Hero Simbu )కు మద్రాస్ కోర్టులో అనుభవం ఎదురయింది.కరోనా కుమార్ సినిమాను పూర్తి చేయడానికి సహకరించడం లేదనే ఆరోపణలపై దాఖలైన కేసులో శింబుకు చేదు అనుభవం ఎదురైంది.
నిర్మాత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన మద్రాస్ కోర్టు భారీ జరిమానాను విధించింది.ఆ వివరాల్లోకి వెళితే.
కరోనా కుమార్( Corona Kumar ) సినిమాలో నటించేందుకు వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకొన్నాడు.ఆ సినిమాలో నటించేందుకు రెమ్యునరేషన్‌గా 9.5 కోట్ల రూపాయలు చెల్లించేందుకు నిర్మాత అంగీకరించాడు.

అడ్వాన్స్‌గా శింబుకు నిర్మాత 4.5 కోట్లు ముట్టజెప్పాడు.అయితే అడ్వాన్స్ అందుకొన్న తర్వాత సినిమా పూర్తి చేయడానికి సహకారం అందించకపోగా నిర్మాతను ముప్పు తిప్పలు పెట్టారు అనే ఆరోపణలతో కేసు నమోదైంది.
అయితే వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ తరఫున శింబుపై కోర్టు( Madras High Court )లో పిటిషన్ దాఖలు చేశారు.శింబుతో జరిగిన ఒప్పంద పత్రంలో కేవలం 1 కోటి రూపాయలు చెల్లించినట్టు స్పష్టమైంది.అయితే 4.5 కోట్లు చెల్లించినట్టు ఎక్కడా లేకపోవడంతో కోర్టు కేవలం 1 కోటి రూపాయలు దాఖలు చేయాలని తన తీర్పులో వెల్లడించింది.

హీరో శింబుపై వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్( Vels International ) దాఖలు చేసిన పిటిషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి అబ్దుల్ ఖుదోస్ ఆదేశాలు జారీ చేశారు.కరోనా కుమార్ సినిమా పూర్తి చేయకుండా మరో సినిమాలో నటించకూడదు అని నిర్మాత చేసిన డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకొన్నది.దాంతో అడ్వాన్సుగా చెల్లించిన 1 కోటి రూపాయలు మూడు వారాల్లోగా కోర్టులో దాఖలు చేయాలని శింబుకు కోర్టు సూచించింది.అయితే కోటి రూపాయలు అడ్వాన్సుతో పాటు శింబుకు బ్యాంకు ద్వారా చెల్లించినట్టు ఆధారాలను నిర్మాత చూపించారు.అయితే వాటికి సరైన ఆధారాలు లేని కారణంగా ఆ 4.5 కోట్ల మొత్తాన్ని చెల్లించినట్టు రుజువు చేయలేం.కాబట్టి కోటి రూపాయలు మూడు వారాల్లోగా చెల్లించాలని తన ఆదేశాల్లో పేర్కొంది.







