స్మార్ట్‌ఫోన్ కలిగి ఉన్న ప్రతిఒక్కరి ఫోన్లలో తప్పనిసరిగా వాట్సప్( Whatsapp ) అనేది ఉంటుంది.వాట్సప్ అనేది నిత్యావసరంగా మారిపోయింది.
వాట్సప్ లేనిది ఒక్క నిమిషం కూడా ఉండలేనంతగా దాని వినియోగం పెరిగింది.ఆఫీస్ పనుల కోసం, వ్యక్తిగత పనుల కోసం వాట్సప్ అనేది అవసరంగా మారిపోయింది.
ఆఫీసు విషయాల కోసం, ఫ్రెండ్స్ తో ఛాటింగ్ చేసుకునేందుకు లేదా ఫొటోలు, వీడియోలు పంపించుకునేందుకు వాట్సప్‌ను వినియోగిస్తూ ఉంటారు.

అయితే తమ యూజర్లను మరింతగా పెంచుకునేందుకు, ప్రస్తుతం ఉన్న యూజర్లను ( Whatsapp Users ) ఆకట్టుకునేందుకు వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తూ ఉంటుంది.ఎప్పుడూ ఏదోక నయా ఫీచర్ ను లాంచ్ చేస్తూనే ఉంటుంది.అందులో భాగంగా త్వరలో మరో అదిరిపోయే ఫీచర్ ను వాట్సప్ లాంచ్ చేయనుంది.
ఒరిజినల్ ఫొటోలు, వీడియోలు షేరింగ్ చేసేలా కొత్త అప్డేట్ ను వాట్సప్ తీసుకొస్తుంది.ఈ ఫీచర్ కి సంబంధించిన గ్లిమ్స్ ను కూడా వాట్సప్ ఇచ్చింది.వెబ్ బీటా ఇన్పోలో ఈ ఫీచర్ కు సంబంధించిన సమాచారం వచ్చింది.వాట్సప్ అప్‌కమింగ్ అప్టేట్ 2.23.18.12లో ఈ కొత్త ఫీచర్ తీసుకురానుంది.అనంతరం మిగతా యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది.

ఈ ఫీచర్ వల్ల యూజర్లు ఎలాంటి షింక్ అడ్డంకి లేకుండా ఇమేజ్,( Images ) వీడియోలను( Videos ) ఉన్నది ఉన్నట్లుగా ఒరిజినల్ సైజులో షేర్ చేసుకోవచ్చు.ప్రస్తుతం ఈ అప్ కమింగ్ ఫీచర్‌పై వాట్సప్ పనిచేస్తుంది.ఈ ఫీచర్ వల్ల ఇమేజ్, వీడియో షేరింగ్ అప్డేట్ ను పొందవచ్చు.ఈ ఫీచర్ వల్ల 2జీబీ సైజుల వరకు ఫొటోలు, వీడియోలను నేరుగా షేర్ చేసుకోవచ్చు.
డాక్యుమెంట్ ఆప్షన్ ద్వారా ఒరిజినల్ వీడియోలు, ఫొటోలను పంపించుకోవచ్చు.ఇప్పటికే హెచ్‌డీ వీడియో, హెచ్‌డీ ఫొటో షేరింగ్ ఫీచర్ ను వాట్సప్ అందించిన విషయం తెలిసిందే.







