టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల నుండి ఈ ఎన్నికల గురించి జోరుగా ప్రచారాలు జరుగాయి.
ఇందులో ప్రెసిడెంట్ గా పోటీ చేయడానికి సినీ నటుడు ప్రకాష్ రాజ్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.అంతేకాకుండా మంచు విష్ణు కూడా పోటీ చేయడానికి ముందుకు వచ్చాడు.
రెండేళ్లకొకసారి జరిగే ఈ ఎన్నికలు గత ఏడాది జరగవలసి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది.దీంతో పరిస్థితులు కాస్త చక్కబడటంతో ఎన్నికలకు సిద్ధమయ్యింది ఇండస్ట్రీ.ఇప్పటికే ప్రకాష్ రాజ్ అసోసియేషన్ లో గట్టిపోటీ తో రంగంలోకి దిగాడు.మంచు విష్ణు కూడా అదే వాటితో ముందుకు వచ్చాడు.
ఇదిలా ఉంటే మా ఎన్నికల సందర్భంగా చిరంజీవి, బాలయ్య, పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఎవరికని హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పటికే చాలామంది చిరంజీవి మద్దతుతోనే మంచు విష్ణు రంగంలోకి దిగాడని టాక్ వినిపించింది.కానీ తాజాగా ఈ ఎన్నికల గురించి స్పందించాడు.ఎప్పుడూ పరిస్థితులు ఒకేలా ఉండవు అంటూ తెలిపాడు.
కాబట్టి పరిస్థితులు తగ్గట్టు మనం నడుచుకోవాలి కానీ ఇలాంటివి జరగకూడదని లేదు ప్రజాస్వామ్యంగా జరగాలని కోరుకునే విధంగానే జరుగుతుంది అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు.

అంతేకాకుండా తాను వ్యక్తిగతంగా మాట్లాడి ఓటర్లను ప్రభావితం చేయనని అన్నారు.ఎక్కువ మంది ఓటర్లు ఎవరిని ఎన్నుకుంటే వాళ్లకే తన మద్దతని తెలిపాడు చిరు.ఈ ఎన్నికల్లో ఇది ఒక ప్రత్యేకమైన సందర్భం అని ప్రతిసారి ఇంత పోటీ జరగదని భవిష్యత్తులో ఇలా ఉండకుండా తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపాడు చిరంజీవి.
ఇక పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎన్నికల గురించి స్పందించగా.
ఎప్పుడు వ్యక్తులు చేసేది సినిమా రంగానికి అంటదని వాళ్లు చేసే ఆరోపణలు వ్యక్తిగతంగా కూడా అంటదని అన్నారు.
ఈ అసోసియేషన్ లో అందరూ ఐక్యమత్యంగా ఉండి మాట్లాడితే సరిపోయేది కానీ అలా జరగటం లేదని వాపోయాడు.సినీ ఇండస్ట్రీ ఐక్యమత్యాన్ని విడదీసేలా వ్యవహరించకూడదని తెలిపాడు.
ఇక ఇందులో డబ్బులు పంచుతున్న విషయం తనకు తెలియదని తెలిపాడు.

ఇక బాలకృష్ణ కూడా స్పందించగా.ప్రతిసారి వచ్చినట్లే ఎన్నికలు వచ్చాయని.బాగా చేసే వాళ్ళు ఎవరని అనిపిస్తేనే వాళ్లకే ఓటు వేశానని అన్నారు.
ఇక ఈ ఉత్సాహం చూస్తుంటే రెండు ప్యానెల్స్ బాగానే పనిచేస్తాయి అనిపిస్తుందని కానీ ఒక్కరికి మాత్రమే వెయ్యాలి కదా అని తెలిపాడు.ఇక అవతలి ప్యానెల్లో కూడా బాగా పని చేసే వాళ్ళకి ఓటు వేశానని తెలిపాడు.
ప్రకాష్ రాజ్, విష్ణు తనకు ఇద్దరు కావాల్సిన వాళ్లే అని అన్నారు.
వీళ్లే కాకుండా సాయి కుమార్, ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, నరేష్, హీరోయిన్ రాశి తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని కొన్ని విషయాలను పంచుకున్నారు.
ఈసారి పోలింగ్ శాతం పెరగవచ్చని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.ఇక ఓటు వేయడానికి చాలామంది వస్తున్నారు.
మరికొందరు సెలబ్రెటీలు ఓటు వేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఓటు వేశామని తెలిపారు.