Cheapest Car Loans : కారు కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. ఈ బ్యాంక్స్‌లో తక్కువ ధరకే లోన్స్‌..

ఒకప్పుడు కారు కొనుగోలు చేయడం కేవలం ధనవంతులకే సాధ్యమయ్యేది.వారు మాత్రమే కార్లలో తిరిగేవారు.

 These 10 Banks Offer The Cheapest Car Loans,cheapest Car Loans,car,car Loan Inte-TeluguStop.com

మధ్య తరగతి కుటుంబాలకు కారు ఒక కలలాగే ఉండేది.కానీ ప్రస్తుత కాలంలో ఆ పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు.

ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలకు కూడా కారు కొనడం అనేది చాలా చిన్న విషయం అయిపోయింది.ఈరోజుల్లో ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమంది ఉద్యోగాలు చేస్తూ వారి ఆదాయాన్ని పెంచుకుంటున్నారు.

దానికి తోడు బ్యాంకులు కూడా వెహికల్ లోన్స్‌ ఇస్తున్నాయి.కాగా ప్రస్తుతం కొన్ని బ్యాంకులు కారు లోన్‌ను చాలా తక్కువ వడ్డీ రేట్లకే ఆఫర్ చేస్తున్నాయి.ఈ రుణాలపై వడ్డీ రేట్లు కేవలం 7.90% నుంచి మొదలవుతున్నాయి.మరి కారు లోన్ కోసం ఏ బ్యాంకు ఎంత వడ్డీ వసూలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

కారు రుణాలపై వార్షిక వడ్డీ రేటు శాతంలో తెలుసుకుంటే.సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.90%. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.05%.ఐసీఐసీఐ బ్యాంకు 8.25%.బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.30%.హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 8.35%.పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ 8.35%.యాక్సిస్ బ్యాంకు 8.40%. బ్యాంక్ ఆఫ్ బరోడా 8.45%.యూనియన్ బ్యాంకు 8.45%.ఇండియన్ బ్యాంకు 8.50%.యూకో బ్యాంకు 8.100%.కెనరా బ్యాంకు 8.90%. కరూర్ వైశ్యా బ్యాంకు 9.00% ధనలక్ష్మీ బ్యాంకు 9.25% ఉంది.ఇక రూ.7.50 లక్షల కారు లోన్ తీసుకుంటే 7 ఏళ్ల కాల వ్యవధికి ప్రతీనెలా ఈఎంఐ అనేది రూ.11,652 నుంచి రూ.12,162 రేంజ్‌లో ఉంటుంది.

Telugu Axis Car Loan, Banksinterest, Carloan, Sbi Car Loan-Latest News - Telugu

పైనున్న వడ్డీ రేట్లు 2022, నవంబర్ 1 నాటివి అని గమనించాలి.ఇక్కడ కేవలం బ్యాంకులు చెప్పిన అతి తక్కువ వడ్డీ రెట్లు మాత్రమే ఉన్నాయని కూడా గమనించాలి.లోన్ అమౌంట్, లోన్ టెన్యూర్, లోన్ తీసుకునేవారి ఆదాయం, క్రెడిట్ స్కోర్ వంటి అంశాల ఆధారంగా వడ్డీ రేటు మరే అవకాశం ఉంటుంది.ప్రాసెసింగ్ ఫీజ్, ఇతర ఛార్జెస్ ఈఎంఐలో యాడ్ చేయలేదు కాబట్టి ఈఎంఐ కూడా స్వల్పంగా పెరిగే ఛాన్స్ ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube