కరెంట్ ఆదా చేసే లవ్లీ సోలార్ ఫ్యాన్స్ వచ్చేశాయి.. ధర కేవలం రూ.600 మాత్రమే..!

వేసవికాలం( Summer ) వచ్చిందంటే ఇంట్లో రాత్రి పగలు ఫ్యాన్ తిరుగుతూ ఉండాల్సిందే.తద్వారా కరెంట్ బిల్లు విపరీతంగా వస్తుంది.

 Lovely Solar Fan Zero Electricity Availabe At Just 600 Rs Details, Lovely Solar-TeluguStop.com

దీంతో చాలామంది కరెంటు బిల్లుల భారం మోయలేక ఇబ్బందులు పడుతున్నారు.కరెంట్ బిల్లు భారం పడకుండా.

గదిలో నిరంతరం ఫ్యాన్( Fan ) తిరుగుతుందంటే వినడానికే ఎంతో ఆనందంగా ఉంటుంది.మార్కెట్లోకి సోలార్ సిస్టం తో నడిచే ఫ్యాన్లు అందుబాటులోకి వచ్చాయి.

ఇక వేసవికాలంలో కరెంట్ బిల్లుల భారం భారీగా తగ్గినట్టే.ఈ లవ్లీ సోలార్ ఫ్యాన్( Lovely Solar Fan ) ప్రత్యేకతలు ఏమిటో చూద్దాం.

ఈ ఫ్యాన్ ను పోర్టబుల్ సోలార్ సిస్టం లవ్లీ ఫ్యాన్ గా చెప్పుకోవచ్చు.ఈ ఫ్యాన్ ఇంట్లో ఉంటే కరెంటు వినియోగం దాదాపుగా తగ్గినట్టే.ఈ సోలార్ సిస్టం ఫ్యాను ఒకే బటన్ తో నియంత్రించవచ్చు.ఇంట్లో హాల్, బెడ్ రూమ్, వంటగది, బాల్కనీ లలో ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు.

ఈ ఫ్యాన్లు 28D*26W*16H సైజులో అందుబాటులో ఉన్నాయి.దీని మార్కెట్ ధర రూ.599 గా ఉంది.ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ నుండి రెండు శాతం డిస్కౌంట్ తో రూ.589 కు కొనుగోలు చేయవచ్చు.ఈ ఫ్యాన్ వివిధ రకాల రంగులలో అందుబాటులో ఉంది.

సోలార్ ఫ్యాన్ వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని కలగదు.ఇది కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుంది.

మొదట దీన్ని ఏర్పాటు చేయడంలో కాస్త ఖర్చు ఎక్కువ అయినప్పటికీ దీర్ఘకాలంలో చాలా ఖర్చు ఆదా అవుతుంది.ఈ సోలార్ ఫ్యాన్ కు ఒక సంవత్సరం పాటు గ్యారంటీ కూడా పొందవచ్చు.మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని వివిధ ఫ్యాన్ల కంపెనీలు సోలార్ ఫ్యాన్ల ఉత్పత్తిలపై దృష్టి సారించాయి.కాబట్టి వేసవికాలంలో ఈ సోలార్ ఫ్యాన్ల ఉపయోగం వల్ల కరెంటు బిల్లుల భారం చాలావరకు తగ్గించుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube