ఢిల్లీలోని( Delhi ) రక్షణ శాఖలో పనిచేసే ఓ యువకుడికి ఫేస్బుక్ ద్వారా ఇద్దరు అమ్మాయిలు పరిచయమై హనీ ట్రాప్( Honey Trap ) లోకి దింపారు.ఈ అమ్మాయిల అందచందాలకు బానిసై ఏకంగా దేశానికి ద్రోహం చేశాడు.
ఆ యువకుడు దేశానికి చేసిన ద్రోహం ఏమిటో.దానికి సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.
రాజస్థాన్ కు( Rajasthan ) చెందిన రవిమీనా అని యువకుడు ఢిల్లీలోని సేనా భవన్ లో 2015 నుంచి పనిచేస్తున్నాడు.రవికు గతంలో ఫేస్బుక్ ద్వారా పాకిస్తాన్ గూడచార సంస్థ ISI చెందిన ఇద్దరు అమ్మాయిలు పరిచయమయ్యారు.
అయితే ఈ అమ్మాయిలు భారతదేశానికి చెందిన అమ్మాయిలే అనుకుని రవి మీనా వారితో చాటింగ్ చేయడం ప్రారంభించాడు.
ప్రతిరోజు ఆ ఇద్దరు అమ్మాయిలు, రవిమీనా తో చాటింగ్ చేస్తూ తమ అందానికి బానిసను చేశారు.
ఒక్క రవి మీనా తోనే కాకుండా మరో ఐదు మంది యువకులు కూడా ఈ ఇద్దరు అమ్మాయిల వలలో చిక్కుకున్నారు.అయితే ఈ ఇద్దరు అమ్మాయిల అనుమానంతో ఆ ఐదు మంది యువకులు బయట పడగలిగారు, కానీ రవిమీనా మాత్రం ఆ ఇద్దరి అమ్మాయిలకు బానిసై చాటింగ్ చేయడం కొనసాగించాడు.
కొంతకాలం తర్వాత ఆ ఇద్దరు అమ్మాయిలు. రవి మీనా ద్వారా ఢిల్లీలోని ఉండే రక్షణ శాఖలోని రహస్యాలు అన్ని తెలుసుకోవడం మొదలుపెట్టారు.రవి కూడా అడుగుతున్నది భారతదేశంలోని అమ్మాయిలే అనుకుని దేశ రక్షణకు సంబంధించిన సీక్రెట్ పత్రాలను ఒక్కొక్కటిగా ఫోటోలతో సహా వారికి పంపించడం ప్రారంభించాడు.
ఈ క్రమంలో రక్షణ శాఖలో ఉండే అధికారులకు రవి మీనా పై అనుమానం వచ్చింది.వెంటనే అరెస్ట్ చేయించి పూర్తిస్థాయిలో విచారించగా అన్ని విషయాలు బయటపడ్డాయి.పాకిస్తాన్ గూడచార సంస్థ ISI కు చెందిన ఇద్దరు అమ్మాయిలు.
రవి మీనా ను ట్రాప్ చేసి ఏకంగా రక్షణ శాఖకు సంబంధించిన 40 పత్రాల ఫోటోలను పొందినట్లు బయటపడింది.ప్రస్తుతం పోలీసులు రవి మీనా ఎలాంటి పత్రాలు పంపడనే విచారణ కొనసాగుతూనే ఉంది.
అమ్మాయిల ట్రాప్ లో పడి దేశానికే ద్రోహం చేసిన రవి మీనా పై విమర్శల వర్షం కురుస్తోంది.