అప్పుడప్పుడు కొందరు హీరోలు హీరోయిన్లను మోసం చేస్తూ ఉంటారు.అది సినిమా విషయంలోనో లేక వ్యక్తిగత విషయంలోనో.
అయితే అవి చాలావరకు బయటపడవు కానీ.కొన్ని సందర్భాలలో హీరోయిన్లే బయట పెడుతూ ఉంటారు.
అయితే గతంలో హీరోయిన్ కృతి శెట్టి( Heroine Krithi Shetty )ను కూడా నమ్మించి మోసం చేశాడట ఒక స్టార్ హీరో.అయితే అది ఏ విషయంలో.
అసలు ఆ స్టార్ హీరో ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

కృతి శెట్టి.తొలి చూపులతోనే తెలుగు కుర్రాలను కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ.నటన పరంగా కూడా అతి తక్కువ సమయంలో మంచి మార్కులు సంపాదించుకుంది.
తొలిసారిగా ఉప్పెన సినిమా<( Uppena Movie )/em>తో హీరోయిన్ గా పరిచయమై తొలిచూపులతోనే కుర్రాళ్ళను ఆకట్టుకుంది.ఆ సినిమాలో బేబమ్మ పాత్రతో బాగా ఫిదా చేసింది.నిజానికి ఈ సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా మారి స్టార్ హీరోల దృష్టిలో కూడా పడింది.
హీరోయిన్ గా అడుగు పెట్టక ముందు బాలనటిగా అడుగుపెట్టి ఎన్నో వాణిజ్య ప్రకటనలలో చేసింది ఈ ముద్దుగుమ్మ.
చాలావరకు బాలీవుడ్ అడ్వర్టైజ్మెంట్లలో చేసి ఆకట్టుకుంది.ఆ తర్వాత హీరోయిన్ గా అడుగుపెట్టగా హీరోయిన్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
కొన్ని సినిమాలు సక్సెస్ అందించగా మరికొన్ని సినిమాలు నిరాశ కూడా పరిచాయి.మధ్యలో కొన్ని సీరియల్ ప్రకటనలో, జువెలరీ ప్రకటనలో కూడా చేసింది.
ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంది.

ఇక సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఏదో ఒక పోస్టు తో బాగా హల్ చల్ చేస్తుంది.ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియా( Social Media )లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఫోటో షూట్ లంటూ తెగ సందడి చేస్తుంది.
నిజానికి ఈమె పాతికేల వయసు కూడా దాటలేదు.కానీ ఈమె చేసే పనులు మాత్రం పాతికేళ్లు దాటిన దానిగా ఉంటాయి.
అంటే ఒక హీరోయిన్ పరంగా విషయం పక్కకు పెడితే వ్యక్తిగతంగా కూడా బాగా షో చేస్తూ ఉంటుంది.
ఈ విధంగా ఈమెకు బాగా ట్రోల్స్ ఎదురవుతూ ఉంటాయి.
అయినా కూడా అవి పట్టించుకోకుండా తనకు నచ్చినట్లు ప్రవర్తిస్తుంది.అయితే ఇదంతా పక్కన పెడితే.
గతంలో ఒక స్టార్ హీరో ఈమెను మోసం చేశాడు అని తెలిసింది.ఇంతకు అసలు విషయం ఏంటంటే.
ఈమె హీరో నితిన్ తో కలిసి మాచర్ల నియోజకవర్గం సినిమా( Macherla Niyojakavargam )లో నటించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది.అయితే మొదట ఈ సినిమా హిట్ అవుతుందని స్టోరీ వినగానే కృతికి కూడా డౌట్ కొట్టిందట.అయితే నితిన్( Nithiin ) స్వయంగా తనకు ఫోన్ చేసి ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది నేను పూచి ఇస్తున్నాను అంటూ ధైర్యం ఇచ్చాడట.
అయితే సినిమా విడుదల తర్వాత ప్లాఫ్ కావడంతో మళ్లీ నితిన్ ఆమెకు ఫోన్ కూడా చేసింది లేదని.కనీసం ఆమెకు ఓదార్పును కూడా ఇవ్వలేదు అని తెలిసింది.
దీంతో ఈ విషయం తెలుసుకున్న కృతి అభిమానులు.ఆరోజు కృతిని మోసం చేశాడు కాబట్టి ఇప్పటికీ ఆయనకు సరైన సక్సెస్ లేవు అంటూ.
ఆ పాపం అలాగే వెంటాడుతూ ఉంటుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.