చీరలో సాయి పల్లవి.. వైరల్ ఫోటోలు!

టాలీవుడ్ హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవి గురించి అందరికీ తెలిసిందే.

ఫిదా సినిమా తో ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ ముద్దుగుమ్మ తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

ఈ బ్యూటీ తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం భాషలో కూడా నటించింది.ఇక తెలుగులో నటించిన సినిమాలలో సాయి పల్లవి పాత్ర ఎంతో హోమ్లీగా ఉంటుంది.

ఇక ఈ బ్యూటీ వరుస సినిమాలతో బిజీగా ఉంది.ప్రస్తుతం లవ్ స్టోరీ సినిమా లో నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటించింది.

అంతేకాకుండా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కనున్న విరాటపర్వం సినిమాలో కూడా నటిస్తుంది.ఈ సినిమాలో హీరో రానా నటించగా.

Advertisement

ఈ సినిమా పోస్టర్ ను కూడా విడుదల చేశారు.ఇక ఈ సినిమాలో మరో నటి ప్రియమణి కూడా నటిస్తుంది.

ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల చేయడానికి సినీ బృందం సిద్ధంగా ఉన్నారని తెలిసింది.ఇక నాగ చైతన్య సరసన నటించిన లవ్ స్టోరీ సినిమా త్వరలోనే విడుదల కానుంది.

ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటుంది.తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్ తో పంచుకుంటుంది.

ఇక తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేయగా ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్ గా మారాయి.అందులో సాయి పల్లవి బ్లూ కలర్ చీరలో అందంగా కనిపిస్తూ ఫోటోకు ఫోజు ఇచ్చింది.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

అంతేకాకుండా చీర కట్టు లో సాయి పల్లవి ఎంతో అందంగా కనిపించడంతో పాటు, ఒక ఫోటో కు సిగ్గు పడుతూ ఫోజ్ ఇచ్చింది.మొత్తానికి సాయి పల్లవి ట్రెడిషనల్ లుక్ లో బాగా ఆకట్టుకుంది.

Advertisement

తాజా వార్తలు