స్టూడెంట్ ఫ్రెండ్లీ సిటీగా లండన్.. ఇండియా ఏ స్థానంలో ఉందంటే..?

ప్రపంచంలోనే అతిపెద్ద నగరం, అత్యాధునిక నగరంగా లండన్ కు( London ) పేరుంది.ప్రపంచంలోనే బెస్ట్ సిటీస్‌లలో లండన్ తొలి స్థానంలో ఉంటుంది.

దీంతో ఎంతోమంది విదేశీయులు లండన్ ను సందర్శిస్తూ ఉంటారు.అలాగే చదువు, ఉద్యోగరీత్యా అక్కడకు వెళుతూ ఉంటారు.

లండన్ లో నివసించేవారిలో విదేశాల నుంచి వచ్చినవారు పెద్ద సంఖ్యలో ఉంటారు.ఉద్యోగ రీత్యా వెళ్లి అక్కడే స్థిరపడిపోతారు.

అయితే తాజాగా లండన్‌కు మరో అదురైన ఘనత దక్కింది.

Advertisement

ప్రపంచంలోనే స్టూడెంట్ ఫ్రెండ్లీ సిటీగా( Student Friendly City ) పేరు తెచ్చుకుంది.క్వాక్ క్వారెల్లీ సైమండ్స్ అనే సంస్థ 2024 సంవత్సరానికి స్టూడెంట్ ఫ్రెండ్లీ సిటీల జాబితాను రూపొందించింది.ఇందులో ఈ సారి కూడా లండన్‌ అగ్రస్థానంలో నిలిచింది.

లండన్ తర్వాత జపాన్ రాజధాని టోక్యో( Tokyo ) రెండో స్థానంలో నిలవగా.దక్షిణ కొరియా రాజధాని సియోల్( Seoul ) మూడో స్థానంలో ఉంది.

ఆ తర్వాత ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ నాలుగో స్థానంలో, జర్మనీలోని మ్యూచిన్ నగరం ఐదో స్థానాన్ని దక్కించుకుంది.

టోక్యో గత ఏడాది ఏడో స్థానంలో నిలిచింది.అయితే ఈ సారి ఐదు స్థానాలు మెరుగుపర్చుకుని రెండో స్థానానికి చేరుకుంది.ఇక ఫ్రాన్స్ రాజధాని పారిస్, ఆస్ట్రేలియాకు చెందిన సిడ్నీ, జర్మనీకి చెందిన బెర్లిన్, స్విట్జర్లాండ్‌కు చెందిన జ్యూరిచ్, మసుచాసెట్స్ చెందిన బోస్టన్ నగరాలు ఆరు నుంచి 10వ స్థానాల్లో ఉన్నాయి.

కుమార్తె వ్యాఖ్యలు.. వేదికపై కంటతడి పెట్టిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
మొదలైన నామినేటెడ్ పదవుల హడావుడి ? ఎవరికి ఏ పదవి దక్కేనో ? 

బెర్లిన్, జ్యూరిచ్ 8వ ర్యాంకుని సంపాదించుకున్నాయి.జ్యూరిచ్ 4వ ర్యాంకులో ఉండగా.బెర్లిన్ 6వ ర్యాంకులో ఉన్నట్లు ఈ రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది.

Advertisement

ఇక మన ఇండియా( India ) విషయానికొస్తే.ముంబై( Mumbai ) 118వ స్థానాన్ని దక్కించుకుంది.

ఢిల్లీ ( Delhi ) 132వ ర్యాంకులో.బెంగళూరు 147వ ర్యాంకులో, చెన్నై 151 ర్యాంకులో ఉన్నాయి.

దేశంలో ముంబై తొలి స్థానంలో నిలిచింది.దేశంలోనే బెస్ట్ స్టూడెంట్ సిటీగా ముంబై పేరు దక్కించుకుంది.

కాగా, ప్రతి ఏడాది ఈ ర్యాంకులు వస్తాయి.

తాజా వార్తలు