ఎన్టీఆర్ జపం లో లోకేష్ ? ఈ ప్లాన్ వర్కవుట్ అయ్యేనా ? 

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు.అనేక పర్యటనలు, వివిధ సమస్యలపై పోరాటం చేస్తున్నారు.

క్షేత్రస్థాయిలో జనాలను పలకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ పరిస్థితిని మెరుగుపరిచేందుకు, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని పెంచేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.

మొన్నటి వరకు సోషల్ మీడియాకే పరిమితమైన లోకేష్ ఇప్పుడు ఆ పరిస్థితి రాబోయే రోజుల్లో తమకు ఇబ్బంది తీసుకు వస్తుందనే ఉద్దేశంతో క్షేత్రస్థాయి పర్యటనలు నమ్ముకున్నారు.అయితే ఇదొక్కటే తనకు కలిసిరాదు అని, ఏపీలో తనదైన శైలిలో ముద్ర  వేసుకోవాలంటే బలమైన పునాదులు వేసుకోవాలనే విషయాన్ని లోకేష్ గుర్తించారు.

దీనిలో భాగంగానే ఆయన సైకిల్ యాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.ఈ సందర్భంగా ప్రతి గ్రామంలోనూ ఎన్టీఆర్ విగ్రహాలను ఏర్పాటు చేసి, వాటిని తానే స్వయంగా ప్రారంభించేలా లోకేష్ ప్లాన్ చేసుకుంటున్నారు.

Advertisement

ఏపీ లో ఉన్న 13 జిల్లాలోని ప్రతి పల్లెలోనూ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయించి, కొన్నిటిని తాను ప్రారంభించాలని, దీని ద్వారా ఎన్టీఆర్ కు అసలుసిసలైన వారసుడిని అని నిరూపించుకునేందుకు లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నారు.వైసీపీ అధినేత జగన్ గతంలో ఓదార్పు యాత్ర ద్వారా పెద్ద ఎత్తున గ్రామాల్లో రాజశేఖరరెడ్డి విగ్రహాలు ప్రారంభించడం, జనాను  పలకరించడం తదితర పరిణామాలు ఎక్కడలేని క్రేజ్ తీసుకురావడంతోనే.2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు దోహదం చేశాయి.

ఇప్పుడు తాను అదే ఫార్ములాను ఉపయోగించి అటు ఎన్టీఆర్ అభిమానులతో పాటు అన్ని వర్గాల మద్దతు కూడగట్టుకునేందుకు  ప్రయత్నిస్తున్నారు.అలాగే పదేపదే జూనియర్ ఎన్టీఆర్ టిడిపిలో యాక్టివ్ కావాలని జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టేందుకు, తన తాత ఎన్టీఆర్ ప్రస్తావన లోకేష్ పదేపదే తీసుకువస్తున్నారు.ప్రస్తుతం చంద్రబాబు ఎంతకాలం యాక్టివ్ గా ఉంటారో క్లారిటీ  లేకపోవడంతో, రాబోయే రోజుల్లో తన రాజకీయ జీవితానికి ఇబ్బందులు ఏర్పడకుండా లోకేష్ సొంతంగా ఇమేజ్ ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

అందుకే తాతకు తగ్గ మనవడిగా నిరూపించుకునేందుకు, కమ్మ సామాజిక వర్గంతో పాటు, ఎన్టీఆర్ అభిమానులు అందరూ తనకు మద్దతు ఇచ్చే విధంగా ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్ళబోతున్న తీరు ఆసక్తికరంగా మారింది.

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు