లియో సినిమా హిట్ అయితే సౌత్ లో నెంబర్ 1 డైరెక్టర్ లోకేషేనా..?

తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న డైరెక్టర్లలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన వాళ్లలో లోకేష్ కనకరాజ్( Lokesh Kanagaraj ) ఒకరు.

ఈయన చేసిన ప్రతి సినిమా ఒక అద్భుతం అనే చెప్పాలి.

ప్రస్తుతం తమిళం లో సౌత్ నుంచి నార్త్ వరకు ఉన్న డైరెక్టర్లలో లోకేష్ కు కనకరాజ్ కూడా టాప్ ఫైవ్ లో ఉంటాడు అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఆయన తీసిన సినిమాలు అన్ని కూడా సూపర్ సక్సెస్ అవ్వడం తో ఆయన ఎంత మంచి డైరెక్టర్ అనే విషయం మనకి అర్థం అవుతుంది.

ఇక దానికి తోడు లోకేష్ కనకరాజ్ విజయ్( Vijay Thalapathy ) కాంబినేషన్ లో వస్తున్న లియో సినిమాకు( Leo Movie ) సంబంధించిన ట్రైలర్ రావడం జరిగింది.ఆయన స్టోరీని ఎక్స్ ప్లేయిన్ చేస్తూనే దానికి సంభందించిన వివరాలను కూడా ఈ ట్రైలర్ లో పొందుపరచడం జరిగింది.ఇక ఇప్పటికే తమిళ్ ఇండస్ట్రీ లో లోకేష్ కనకరాజ్ పేరు మాత్రం మారుమోగిపోతోంది అనే చెప్పాలి.

ఇక ఈ క్రమంలో ఆయన విజయ్ తో ఇప్పటికే మాస్టర్( Master Movie ) అనే సినిమా తీశాడు.ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది ఇంక దాంతో ప్రస్తుతం మళ్ళీ విజయ్ తోనే లియో అంటూ ఒక భారీ సినిమా చేయడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

Advertisement

తమిళంలో విజయ్ అభిమానులు కూడా లియో సినిమా పైన భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఇక లోకేష్ కనకరాజుని గొప్ప డైరెక్టర్ గా ఇప్పటికీ విజయ్ ఫ్యాన్స్ అభిమానిస్తున్నారు.ఈ సినిమా కనక హిట్ అయితే లోకేష్ కనకరాజ్ పాన్ ఇండియా నెంబర్ వన్ డైరెక్టర్ గా కూడా కొనసాగుతాడు అనే విషయంలో ఎంత మాత్రం సందేహం లేదు.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ బీభత్సంగా ఉంది అంటూ ప్రతి ఒక్కరూ ఆ ట్రైలర్ గురించి మెచ్చుకోవడం జరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు