లోకేష్ కనకరాజ్ తో సినిమా వద్దు బాబోయ్ అంటున్న ప్రభాస్ ఫ్యాన్స్..!

సౌత్ ఇండియా లో ప్రస్తుతం టాప్ మోస్ట్ డైరెక్టర్స్ ఎవరు అనే లిస్ట్ తీస్తే అందులో లోకేష్ కనకరాజ్( Lokesh Kanagaraj ) పేరు కచ్చితంగా ఉంటుంది.

సందీప్ కిషన్ తో నగరం అనే చిత్రం ద్వారా డైరెక్టర్ గా ఇండస్ట్రీ కి పరిచయమైనా లోకేష్ , ఆ తర్వాత కార్తీ తో తీసిన ఖైదీ చిత్రం తో మొదటిసారి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు.

ఈ సినిమా తర్వాత ఆయన మాస్టర్ మరియు విక్రమ్ వంటి సూపర్ హిట్ సినిమాలు తీసాడు.ముఖ్యంగా విక్రమ్ సినిమా సౌత్ ఇండియా మొత్తం ఏ రేంజ్ సెన్సేషన్ సృష్టించిందో మనమంతా చూసాము.

సరైన హిట్ లేకుండా ఇబ్బంది పడుతున్న కమల్ హాసన్ కెరీర్ లో ఈ చిత్రం 500 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.అలాంటి చిత్రం తర్వాత ఆయన తమిళ స్టార్ హీరో విజయ్ తో కలిసి లియో అనే చిత్రాన్ని చేసాడు.

కనీ వినీ ఎరుగని రేంజ్ భారీ అంచనాల నడుమ నిన్న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , హిందీ , తమిళం, మలయాళం మరియు కన్నడ బాషలలో విడుదలైన ఈ సినిమాకి మొదటి ఆట నుండే డివైడ్ టాక్ వచ్చింది.సినిమా ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉన్నప్పటికీ, సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ మరియు స్టోరీ లైన్ చాలా సిల్లీ గా అనిపించడం తో ఈ చిత్రానికి డివైడ్ రెస్పాన్స్ వచ్చింది.కానీ భారీ హైప్ ఉండడం వల్ల డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కళ్ళు చెదిరే ఓపెనింగ్ ని దక్కించుకుంది.

Advertisement

ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా స్టోరీ పరంగా చాలా వీక్ అయ్యినప్పటికీ, లోకేష్ తన టేకింగ్ టాలెంట్ తో ఈ చిత్రాన్ని ఎక్కడ బోర్ కొట్టకుండా తీసాడు.కచ్చితంగా ఆయన టాలెంట్ ని ఈ విషయం లో మెచ్చుకోవాల్సిందే.

టేకింగ్ మీద పెట్టిన శ్రద్ద స్క్రిప్ట్ మీద కూడా పెట్టి ఉంటే లియో( Leo ) చిత్రం వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టేది.

లోకేష్ తన తదుపరి చిత్రాలు కూడా రీసెంట్ గా ప్రకటించిన సంగతి మన అందరికీ తెలిసిందే.రజినీకాంత్ తో ఒక సినిమా, ఆ తర్వాత ఖైదీ 2 మరియు రోలెక్స్ చిత్రాలు తీసి, చివర్లో విక్రమ్ 2 చిత్రం తో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కి ముగింపు పలుకుతాడట.ఆ తర్వాత ప్రభాస్( Prabhas ) తో ఒక సినిమా ఉంటుందని ప్రకటించాడు.

లోకేష్ కనకరాజ్ వంటి డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా అనగానే నిన్న మొన్నటి వరకు సంబరాలు చేసుకున్న ఫ్యాన్స్, ఇప్పుడు లియో చిత్రం చూసి మాకు నీతో సినిమా వద్దు రా బాబోయ్ అంటూ సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు.ప్రభాస్ కి అసలే బ్యాడ్ టైం నడుస్తుందని, ఇలాంటి సమయం లో ఆయనకి లియో లాంటి ప్రోడక్ట్ ని ఇస్తే తట్టుకోలేము అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

రూ. 1 కోటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పినా.. కంటెస్టెంట్ కి నిరాశే..?
అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?

ప్రభాస్ ఫ్యాన్స్ పెట్టిన ఈ పోస్టులు సోషల్ మీడియా లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు