టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ మంత్రి మేరుగ నాగార్జున తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.చంద్రబాబు జీవితం అంతా అవినీతిమయమేనని ఆరోపించారు.
చంద్రబాబు అవినీతిలో కూరుకుపోయారని మంత్రి మేరుగ నాగార్జున విమర్శించారు.చంద్రబాబు ఇన్నాళ్లు వ్యవస్థలను మేనేజ్ చేశారని మండిపడ్డారు.
గతంలో ఓటుకు నోటు కేసులో కూడా చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని విమర్శలు గుప్పించారు.తండ్రి తరహాలోనే త్వరలోనే లోకేశ్ కూడా ముద్దాయి కాబోతున్నారని తెలిపారు.
పేదల సొమ్మును అప్పనంగా తినేశారన్న మంత్రి మేరుగ చంద్రబాబు అరెస్టును ప్రజలు స్వాగతిస్తున్నారని వెల్లడించారు.







