Vasuki : బిచ్చగత్తెగా మారిపోయిన ఒకప్పటి లేడి స్టార్ కమెడియన్.. తిరుపతిలో అడుక్కుంటూ అలా?

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు పరిస్థితులు ఏ విధంగా మారుతాయో అంచనా వేయడం చాలా కష్టం.ఎందుకంటే ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన చాలామంది నటీనటులు ఆ తర్వాత కాలంలో సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యి తినడానికి తిండి లేక రోడ్లపై పడుకొని కొంతమంది సెలబ్రిటీలు అయితే ఎవరూ లేని అనాధలుగా కూడా చనిపోయిన వారు చాలామంది ఉన్నారు.

 Lady Comedian Vasuki Turned Bugger In Tirupati-TeluguStop.com

గతంలో ఒక వెలుగు వెలిగిన చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు ఇప్పుడు దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.అటువంటి వారిలో సీనియర్ నటి పాకీజా ( Pakeezah )కూడా ఒకరు.

Telugu Kollywood, Lady Vasuki, Pakeezah, Tirupati, Tollywood, Vasuki-Movie

ఒకప్పుడు నటిగా వెలుగు వెలిగిన పాకీజా ప్రస్తుతం దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది.అంతేకాకుండా 90 ల కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో లేడీ స్టార్ కమెడియన్ గా ఒక వెలుగు వెలిగింది.250కు పైగా సినిమాల్లో నటించింది.తన కామెడీతో ఎంతోమంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.

కాగా ఇప్పటికే ఆమె పరిస్థితి చూసి చెలించిన చాలామంది సెలబ్రిటీలు తోచిన విధంగా సహాయం చేసిన విషయం తెలిసిందే.ఇప్పుడు ఆమె పరిస్థితి మరింత దిగజారింది అని చెప్పవచ్చు.

ఆమె ప్రస్తుత పరిస్థితి కనీసం తినడానికి తిండి లేదు.షుగర్ వ్యాధితో( Diabetes ) బాధపడుతున్నారు.

కనీసం వైద్యానికి కూడా డబ్బులు లేవు. ఒక యూట్యూబర్ ఆమె దీనగాథ వెలుగులోకి తెచ్చారు.

Telugu Kollywood, Lady Vasuki, Pakeezah, Tirupati, Tollywood, Vasuki-Movie

దీంతో ఆమెకు టాలీవుడ్ నుండి కొంత సహాయం అందింది.తన సొంత పరిశ్రమ కోలీవుడ్( Kollywood ) పట్టించుకోలేదని ఆమె వాపోయారు.మంచు విష్ణు ఆమెకు మా కార్ట్ ఇప్పించారు.అలాగే మెగా ఫ్యామిలీ ఆర్థిక సహాయం చేసినట్లు సమాచారం.అయినా ఆమె ఆర్థిక ఇబ్బందులు తీరినట్లు లేదు.ఏకంగా భిక్షాటన చేస్తూ తిరుపతిలో కనిపించింది.

అక్కడ దుకాణాల ముందు ఆమె భిక్షాటన చేస్తుండగా కొందరు గుర్తించారు.దీంతో ఆమె పరిస్థితి మరోసారి వెలుగులోకి వచ్చింది.

కొన్నాళ్లుగా హైదరాబాద్ లో ఉంటున్న వాసుకీ( Vasuki ) ఇంటి అద్దె కూడా చెల్లించలేక అడుక్కుంటున్నారట.కొద్దిరోజుల క్రితం ఆమె జబర్దస్త్ లో మెరిశారు.

ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా వెలుగు వెలిగిన ఆమె ఇప్పుడు తిరుపతిలో దుకాణాల ముందు ఆడుకుంటూ అలా కనిపించడంతో చాలామంది బాధను వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube