టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి( Chandrababu Naidu ) రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడంతో ఇక తదుపరి ప్రణాళికలపై ఆయన ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యం కావడంతో చంద్రబాబుపై మోపిన అక్రమ కేసులను ప్రజల్లో ప్రస్తావిస్తూ సానుభూతి పెంచుకునేందుకు బాబు ప్లాన్ చేస్తున్నారట.
అయితే ఒకవేళ సానుభూతి వర్కౌట్ అయి టీడీపీ అధికారంలోకి వస్తే వాట్ నెక్స్ట్ అనే ప్రశ్నలు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.టీడీపీ అధికారంలోకి వస్తే పార్టీ పగ్గాలతో పాటు సిఎం పదవి కూడా లోకేష్ ( Nara Lokesh )కు అప్పజెప్పే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ మద్య ఆయన ఆరోగ్య రీత్యా పలు సంశ్యాలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే కంటి ఆపరేషన్ చేయించుకున్న చంద్రబాబుకు హార్ట్ సమస్యలు కూడా వేధిస్తున్నాయి.దాంతో ఎలాగైనా ఈసారి ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చి ఆ తరువాత లోకేష్ భుజాన బాద్యతలు మోపి ఆయన రాజకీయాల నుంచి దూరం కావాలనే ఆలోచన చేస్తున్నారని టాక్.కాగా వచ్చే ఎన్నికల్లో జనసేనతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే.
అందువల్ల టీడీపీ విజయంలో జనసేన పాత్ర కూడా ఉంటుంది.మరి లోకేష్ కు సిఎం పదవి ఇచ్చేలా చంద్రబాబు వ్యవహరిస్తే పవన్( Pawan Kalyan ) ఎంతవరకు సమ్మతిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.

గత కొన్నాళ్లుగా సిఎం పదవి విషయంలో తన ఇష్టాన్ని నొక్కి చెబుతున్నా
పవన్
.సిఎం పదవిపై వెనక్కి తగ్గే ఛాన్స్ చాలా తక్కువ.అందుకే టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే పవన్ మరియు లోకేష్ చెరో రెండున్నర సంవత్సరాలు సిఎం గా ఉండేలా బాబు ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తున్నారట.లోకేష్ విషయంలో గతంలో ఉన్న వ్యతిరేకత ఇప్పుడు చాలా వరకు పార్టీలో సద్దుమనిగిందనే చెప్పాలి.
యువగళం పాదయాత్ర( Yuvagalam Padayatra ) ద్వారా పాలిటిక్స్ పై పరిణితి సాధించిన లోకేష్ టీడీపీని నడిపించగలడనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో నెలకొంది.అందుకే వీలైనంతా త్వరగా పార్టీ పగ్గాలు లోకేష్ కు అప్పగించేందుకు బాబు ప్లాన్ చేస్తున్నారట.
మరి చంద్రబాబు ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.